
గిరిజన యూనివర్సిటీకి పరిశోధనా ప్రాజెక్ట్
విజయనగరం అర్బన్: కేంద్రియ గిరిజన యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బయోటెక్నాలజీ విభాగానికి రూ.4 కోట్ల విలువైన పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరైంది. శనివారం స్థానిక యూనివర్సిటీ క్యాంపస్‌లో వీసీ టీవీ కట్టిమణి విలేకరులతో మాట్లాడుతూ.. ‘గిరిజనులలో సికిల్‌సెల్ ఎనీమియా’ అనే ఆరోగ్య సమస్యపై పరిశోధన చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవికి అప్పగించిందని తెలిపారు. ఆదివాసీలు అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలలో సికిల్ సెల్ వ్యాధి నివారణకు రూ.4 కోట్ల వంతున మంజూరు చేయనున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి చేపడుతున్నారని చెప్పారు. తాజాగా యూనివర్సిటీ తరఫున వచ్చిన ఈ పరిశోధనా మిషన్‌లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆదివాసులపై పరిశోధనలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి