
కార్యకర్తలకు అండగా ఉంటాం
విజయనగరం రూరల్:
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త మురళీరాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా మురళీరాజు భార్య సుష్మ తన పిల్లలతో కలిసి శుక్రవారం జెడ్పీ కార్యాలయానికి వచ్చి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలకు జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు