నెలల తరబడి బిల్లులు పడలేదు...
మాకు నెలల తరబడి ‘ఉపాధి’ బిల్లులు పడలేదు. గతంలో నాలుగైదు రోజుల్లో డబ్బులు మా చేతిలో పడేవి. ఇప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది.
– బెవర త్రినాథరావు,
వేతనదారుడు, వన్నలి, రేగిడి మండలం
–––––––––––––––––––––
వేతనాలు అందక ఇబ్బందులు
మండుటెండలో చాలా దూరం నడిచి ఉపాధి హమీ పనులకు వెళ్తున్నాం. కానీ సకాలంలో వేతనాలు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– కల్లూరి సింహాచలం,
వేతనదారుడు, పెదమానాపురం
––––––––––––––––––––––––––––
మండుటెండలో పనికి వెళ్తున్నాం...
గత ప్రభుత్వంలో ఉపాధి పనికి వెళ్తే వేతనం గిట్టుబాటు అయ్యేది. సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మండుటెండలో పనికి వెళ్తున్నాం. అయినా ప్రభుత్వం కనికరించట్లేదు.
– వెంకటరమణ, వేతనదారుడు, పెదమానాపురం
––––––––––––––––––––––––––––
కష్టపడి పనిచేస్తున్నా
సుఖం లేకపోతోంది
ఉపాధి హామీ వేతనాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. రోజూ కిలోమీటరు దూరంలోని బ్యాంకుకు వెళ్లి డబ్బులు పడ్డాయో లేవో అని బ్యాంకు ఖాతాను తనిఖీ చేసుకోవడమే సరిపోతోంది. ఇంకా డబ్బులు పడలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో నిరాశతో తిరుగొస్తున్నాం.
– ఎన్ రమణ, ఒమ్మి, నెల్లిమర్ల మండలం
నెలల తరబడి బిల్లులు పడలేదు...
నెలల తరబడి బిల్లులు పడలేదు...
నెలల తరబడి బిల్లులు పడలేదు...


