
విజయనగరంలో క్రికెట్ బెట్టింగ్‌ల జోరు
● ఏడుగురిపై కేసు నమోదు
విజయనగరం క్రైమ్: ఐపీఎల్ జరుగుతున్న వేళ ప్రతిచోటా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే క్రికెట్ బెట్టింగ్‌లపై అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాచారం తెలిసిన వెంటనే కేసులు నమోదు చేయాలని సోమవారం ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ సూచనలతో విజయనగరం వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తన బృందంతో కలిసి దాడి చేసి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న స్థానిక ఉల్లి వీధికి చెందిన బుర్లి వాసును పట్టుకుని విచారణ చేయగా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో శేఖర్, శ్రీను, అప్పలరాజు, నారాయణరావు, ఓబుల్‌రెడ్డి, గోల్డ్ శ్రీనులపై కేసు నమోదు చేశారు.