
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
–8లో
మృత్యుంజయుడు పింటూ
భామిని మండలం సింగిడి గ్రామానికి
చెందిన పింటూ ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో అందరూ పిరిపీల్చుకున్నారు.
చీపురుపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ నియమాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన సాగిస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా పాలన రావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా చీపురుపల్లి పట్టణం లావేరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశారన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ సమానత్వంతో జీవించాలని, విద్యావకాశాలు అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. దీనికి అనుగుణంగానే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేసి ప్రతిఒక్కరూ చదువుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తండ్రి బాటలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా మరో రెండు అడుగులు ముందుకు వేసి విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మఒడి, నాడు–నేడుతో పాఠశాలలను అభివృద్ధి చేశారని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కక్షపూరితమైన రెడ్‌బుక్ పాలన సాగిస్తోందన్నారు. మద్యం, గంజాయి, మహిళలపై దాడులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, విపక్షాలపై దాడులు, ప్రతిపక్ష సోషల్ మీడియా వారిపై తప్పుడు కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు గెరిడి రామదాసు, నాయకులు ఇప్పిలి తిరుమల, ముళ్లు పైడిరాజు, మజ్జి శంకరరావు, కరణం ఆదినారాయణ, గవిడి సురేష్, అడ్డూరి కృష్ణ, ప్రభాత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ తీరును విమర్శించిన మాజీ ఎంపీ బెల్లాన