
వేతనం ఇవ్వకపోతే బతికేది ఎలా?
నెలల తరబడి వేతనం ఇవ్వకపోతే ఎలా బతుకుతాం. ఇప్పుడు భవన నిర్మాణ పనులకు వెళ్దామన్నా అక్కడా పని దొరకట్లేదు. తప్పక ఉపాధి పనులకు వెళ్లితే అక్కడా వేతనాలు ఇవ్వట్లేదు.
– బొడసింగి సీత, బోడసింగిపేట,
బొండపల్లి మండలం
––––––––––––––––––––––––––––––
మూడు మాసాల నుంచి డబ్బులు పడడం లేదు
ఉపాధిహామీ పని డబ్బులు మూడు మాసాలుగా ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఎండలో పనిచేస్తున్నాం. వారంవారం ఇవ్వాల్సిన డబ్బులు ఇంతకాలం పడలేదు. గత ప్రభుత్వంలో ప్రతివారం అందేవి.
– బి.రాములు, గజపతినగరం
మాటలకు చేతలకు తేడా ఉంది...
ఉపాధి హామీ వేతనదారులకు రోజూ రూ.300 వరకూ వేతనం గిట్టుబాటు అయ్యేలా చూస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పారు. కానీ రోజువారీ కూలీ రూ.160కు మించట్లేదు. ఆ డబ్బులు కూడా రెండున్నర నెలలుగా ఇవ్వలేదు. నాకు, నా భార్యకు కలిపి సుమారు రూ.10 వేల వరకూ రావాలి. – బి.తవిటినాయుడు,
జె.రంగరాయపురం, బొబ్బిలి మండలం
––––––––––––––––––––––––––––––
పనులు చేసినా పస్తులు తప్పట్లేదు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకంలో పనులు చేసినా పస్తులు తప్పడం లేదు. బిల్లులు ఇవ్వడం లేదు. మేము పనులు చేసి 13 వారాలు అయింది. ఇంతవరకూ రూపాయి ఇవ్వలేదు.
– తొత్తడి భారతి, కొత్తూరు, ఎస్.కోట మండలం

వేతనం ఇవ్వకపోతే బతికేది ఎలా?

వేతనం ఇవ్వకపోతే బతికేది ఎలా?

వేతనం ఇవ్వకపోతే బతికేది ఎలా?