అంధ విద్యార్థులకు ఉచిత వసతి, విద్యాబోధన
గజపతినగరం: ఒకటవ తరగతి నుంచి 10వతరగతి వరకు విద్యాభ్యాసంతో పాటు భోజన, వసతి సౌకర్యాన్ని అంధ విద్యార్థులకు ఉచితంగా కల్పించనున్నామని ఆసక్తి గల విద్యార్థులు చేరాలని బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ టీచర్స్ సుధాకర్ బుష్మి, బి.త్రినాథం, పి.రాజులు తెలిపారు. ఈ మేరకు బుధవారం గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావుకు కరపత్రాలను అందజేసి విలేకరులతో మాట్లాడారు. గజపతినగరం, పురిటిపెంట, ఎం.వెంకటాపురం గ్రామాల్లో వారు పర్యటించి దృష్టి లోపం గల విద్యార్థులకు ప్రభుత్వ అనుసంధానంతో కూడిన బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ అన్నిరకాల సదుపాయాలను అందిస్తుందని ఆసక్తిగల వారు ముందుకు వచ్చి ఇక్కడ చదువుకుని ఉన్నతమైన స్థానాలకు చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎంఈఓ కార్యాలయం, భవిత సెంటర్ సిబ్బందిని కలిసి కరపత్రాలను అందజేశారు.
బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ టీచర్స్


