
ఉలిక్కిపడిన శివరాం
చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో యువతికి
ప్రథమ చికిత్స
అందిస్తున్న
వైద్య
సిబ్బంది
చీపురుపల్లిరూరల్ (గరివిడి): పట్టపగలు.. అందరూ వీధిలో తిరుగాడుతుండగా.. శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంటి ఆవరణలో పాత్రలు కడిగే పనుల్లో నిమగ్నమైన యువతిపై ముసుగు వేసుకుని వచ్చిన యువకుడు కత్తితో దాడిచేసి పరారైన ఘటనతో గరివిడి మండలం శివరాం గ్రామం ఉలిక్కిపడింది. ఎన్నడూ చూడని, జరగని విధంగా యువతిపై దాడిచేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మహిళలకు రక్షణలేదన్న మాటే అందరినోటా వినిపించింది. ఇంటివద్ద ఉంచినా అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతున్నా మన్న ఆవేదన గ్రామస్తుల్లో కనిపించింది. మద్యం ఏరులైపారుతుండడం, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో కొందరు యువకులు భయం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నాంటూ జనం మండిపడ్డారు.
అదును చూసుకుని...
శివరాం గ్రామానికి చెందిన బాధితురాలు కోండ్రు అఖిల తల్లిదండ్రులతో పాటు నానమ్మ, ఇద్దరు అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు పనికి వెళ్లిపోయారు. నాన్నమ్మ, అఖిల మాత్రమే ఇంటిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన యువకుడు సినిమా సన్నివేశాన్ని తలపించేలా మంకీ క్యాప్ ధరించి పరుగున ఇంటి పనుల్లో నిమగ్నమైన అఖిల వద్దకు వెళ్లాడు. క్షణం ఆలోచించకుండా విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు. కడుపు పక్కభాగంలో రెండు చోట్ల గాయపరిచాడు. యువతి కేకలు వేయడంతో పరారయ్యాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించి చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంటిలో ఉండే ఆడబిడ్డ కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితికి చేరడంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
యువతి పరిస్థితి విషమం...
కత్తిపోట్లకు గురైన అఖిల పరిస్థితి విషమంగా ఉందని వైద్యబృందం తెలిపినట్లు బంధువర్గాలు చెబుతున్నాయి. యువతి కడుపులోకి బలంగా కత్తిపోట్లు వెళ్లడంతో లోపల లివర్ భాగానికి తగిలి రక్తస్రావం జరుగుతోంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నట్టు యువతి బంధువులు తెలిపారు.
ఎస్పీ సందర్శన..
సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్పీ వకుల్‌జిందాల్ గ్రామానికి చేరుకుని డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం సీఐ ఉపేంద్ర, గరివిడి ఎస్‌ఐ బి. లోకేశ్వరరావుతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో సాంకేతిక ఆధారాలు సేకరించారు. యువతిపై జరిగిన దాడి కేసు మిస్టరీని ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
పోలీసుల అదుపులో అనుమానితులు
ఈ దాడి సంఘటనలో పోలీసులు అదే గ్రామానికి చెందిన ప్రధాన అనుమానితుడు బూర్లె ఆదినారాయణతో పాటుగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఇంటి ఆవరణలో పనిచేస్తున్న
యువతిపై కత్తిపోట్లు
ముఖానికి మంకీ క్యాప్ ధరించి కత్తితో పొడిచి పరారైన దుండగుడు
యువతికి తీవ్రగాయాలు
విజయనగరంలోని ఓ ప్రైవేటు
ఆస్పత్రిలో చికిత్స
సంఘటన జరిగిన ప్రాంతాన్ని
సందర్శించిన ఎస్పీ వకుల్ జిందల్
డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్స్‌తో ఆధారాలు
సేకరించిన పోలీస్ బృందం
నలుగురిని అదుపులోకి తీసుకున్న
పోలీసులు

ఉలిక్కిపడిన శివరాం

ఉలిక్కిపడిన శివరాం

ఉలిక్కిపడిన శివరాం