
కథలు అభ్యుదయ భావాలకు ప్రతీకలు
విజయనగరం అర్బన్: ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు కథలు అభ్యుదయ భావాలకు ప్రతీకగా నిలవడంతో పాటు యువ కథకులకు మార్గనిర్దేశం చేస్తాయని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజి శంకరరావు అన్నారు. విజయనగరంలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో అట్టాడ అప్పలనాయుడు తాను రాసిన నక్షత్రబాట కథా సంపుటిని డీవీజీ శంకరరావుకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కథలు, సామాజిక పరిస్థితులపై అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరినాయుడుతో చర్చించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. విజయనగరం సాహితీ చరిత్రలో కథలకు ఎంతో ప్రాధాన్యముందన్నారు. అప్పలనాయుడు, గౌరినాయుడు వంటి కథా రచయితలు ఎంతో మంది యువ కథకులకు స్ఫూర్తిగా నిలవడం గొప్ప విషయమన్నారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవిజీ శంకరరావు