
దళిత అభ్యున్నతే అంబేడ్కర్ ఆశయం
● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీకట్టిమణి
విజయనగరం అర్బన్: దేశాభివృద్ధికి దళిత అభ్యున్నతే మూలమని, దానినే ఆశయంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసుకున్నారని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. భారతరత్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాల్లో అన్నింటికన్నా ఉత్తమమైన భారత దేశ రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేడ్కర్‌కు దక్కిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి, డాక్టర్ గంగునాయుడు మండల, డాక్టర్ కుసుమ్, సుప్రియదాస్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ జీవీ యూనివర్సిటీలో..
అండ్కర్ జయంతి ఉత్సవాలు స్థానిక జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో సోమవారం వేడుకగా జరిగాయి. స్థానిక యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి యూనివర్సిటీ ఇచ్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దళిత అభ్యున్నతే అంబేడ్కర్ ఆశయం