
బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సురేష్
దత్తిరాజేరు: బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గడసాం గ్రామానికి చెందిన ఇనుగంటి సురేష్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌శర్మ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని బ్రాహ్మణుల అభ్యుదయానికి పాటుపడతానని, గజపతినగరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న బ్రాహ్మణుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.
ఏపీ బ్రాహ్మణ సేవా
సంఘం అధికార ప్రతినిధిగా త్రిశూల్‌కుమార్
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఉత్తరాంధ్ర జోన్ అధికార ప్రతినిధిగా విజయనగరం పట్టణానికి చెందిన త్రిశూల్ విద్యాసంస్థల అధినేత వెంపటి శంకరనారాయణ (త్రిశూల్ కుమార్)ను నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌కేమనోహర్‌రావుల నుంచి ఎంపిక ఆదేశాలు తనకు వచ్చినట్లు త్రిశూల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సురేష్