
●డోలీలో ప్రసవ వేదన..
చిత్రంలో డోలీలో తరలిస్తున్న నిండు గర్భిణి పేరు సోముల బోడమ్మ. ఆమెది ఎస్.కోట మండలంలోని చిట్టింపాడు గిరిశిఖర గ్రామం. సోమవారం పురిటినొప్పులు ఆరంభం కావడంతో భర్త రాముతో పాటు కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. గ్రామానికి వాహనం వచ్చేదారిలేక.. రాళ్ల దారిలో 10 కిలోమీటర్ల మేర డోలీలోనే బొడ్డవర వరకు గర్భిణిని తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి వాహనంలో తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ అడవితల్లి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. తల్లుల ప్రసవ వేదనను ఆలకించాలని కోరారు. ఉత్తుత్తి రోడ్లు ప్రారంభంతో ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మన్యంలో ప్రతి పల్లెకు పక్కారోడ్డు అంటూ ఇచ్చిన హామీని చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. – ఎస్.కోట