
కర్రల మిషన్‌లో పడి మహిళ మృతి
గంట్యాడ: పని చేస్తున్న కర్రల మిషనే ఆమె పాలిట యమపాశమైంది. ప్రమాదవశాత్తూ మిషన్‌లో పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తమతో పనిచేసిన మహిళ కళ్లెదుటే మృతి చెందడంతో సహచర కూలీలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కిడాం గ్రామానికి చెందిన అసకపల్లి జ్యోతి అనే మహిళ, అదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలతో కలిసి సిరిపురం సచివాలయం ఎదురుగా ఉన్న నీలగిరి కర్రల డిపోలో పనికి వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం నీలగిరి కర్రలను మిషన్‌లో వేస్తుండగా చీర కొంగు మిషన్‌లోకి చిక్కుకు పోవడంతో ఒక్కసారిగా మిషన్‌లో పడిపోయింది. దీంతో ఆమె అక్కడక్కడే మృతి చెందింది. మృతిరాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు

కర్రల మిషన్‌లో పడి మహిళ మృతి