తైక్వాండో బ్లాక్ బెల్ట్ పరీక్షలో విజేతలకు అభినందన
విజయనగరం: జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్‌బెల్ట్ టెస్ట్‌లో అర్హత పొందిన క్రీడాకారులను హోటల్ జీఎస్‌ఆర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పలువురు అభినందించారు. ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షలో వి.రోహిణి, చరిష్మా, కె.నిత్య, డి.ప్రియవల్లి, దేవన్ ఫస్ట్ డాన్ బ్లాక్‌బెల్ట్ సాధించగా..వి కుశాల్, పి.పునీత్, ఎస్.సాత్విక్, వై. ముఖేష్, టి.సంకీర్తన, వి.యశ్మిత, సూర్య, కె.సాహిత్య సెకెండ్ డాన్ బ్లాక్ బెల్ట్ టెస్ట్‌లో అర్హత సాధించారు. వారికి జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, సత్య ఐటీఐ విద్యాసంస్థల కరస్పాండెంట్ అల్లు శ్రీకాంత్ సర్టిఫికెట్‌లు ప్ర దానం చేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డి.ప్రసాద్, రాజేష్, కోచ్ యశస్విని పాల్గొన్నారు.


