32 వేల మంది ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: జిల్లాలో వచ్చే మార్చి నాటికి గృహనిర్మాణ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని హౌసింగ్ ఏఈలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. పీఎంఏవై 2.0 కొత్త గృహాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 32 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని, వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో గృహనిర్మాణ ప్రక్రియ, కొత్త ఇళ్ల మంజూరుపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడా రు. పీఎంఏవై (అర్బన్) 1.0 కింద మంజూరైన ఇళ్లలో 11,648 ఇళ్లలో 3,921 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 7,727 ఇళ్ల నిర్మాణాలను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభు త్వం ఇటీవలే అదనపు సాయం కింద ఎస్సీ, బీసీల కు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, అదివాసీ గిరిజన తెగలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేసిందని, ఈ సాయాన్ని లబ్ధిదారులందరికీ వర్తింప జే యాలని చెప్పారు. మున్సిపాల్టీల్లో సుమారు 1,500 మంది లబ్ధిదారులు ఉన్నారని వీరికి ఈ అదనపు సాయాన్ని అందించేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించాలని సూచించారు.
వృద్ధిరేటు పెరగాలి
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ అనుబంధ రంగా ల్లో 12.97 శాతం ఉన్న వృద్ధి రేటును ఈ ఏడాదిలో 16.32 శాతానికి పెంచాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయాధికారులు మండలాల వారీగా ప్రణాళిక రుపొందించాలన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రధానంగా వరి పండుతోందని, ఇతర ప్రత్యామ్నా య పంటల సాగుపైనా దృష్టి పెట్టాలన్నారు. జిల్లా లో 25 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగువు తోందని, ఈ విస్తీర్ణాన్ని కూడా పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, సీపీఓ బాలాజీ పాల్గొన్నారు.


