
24.63
గ్యాస్ భారం
రూ.
కోట్లు
విజయనగరం ఫోర్ట్:
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది మరింత భారం కానుంది. జిల్లాలో మొత్తం 7,04,273 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,85,254, సీఎస్ కనెక్షన్లు 43,287, ఉజ్వల కనెక్షన్లు 1,29,277, జనరల్ కనెక్షన్లు 3,46,455 ఉన్నాయి. ప్రస్తుతం ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్ ధర రూ.520 ఉంది. రూ.50 పెరగడంతో ధర కాస్తా రూ.570కి చేరింది. సాధారణ కనెక్షన్ల గ్యాస్ సిలిండర్ ధర రూ.829 ఉండేది. రూ.50 పెంపుతో 879కి చేరింది. ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఏడాదికి సగటున ఏడు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే ఒక్కొక్కరిపై రూ.350 అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ఏడాదికి జిల్లా వినియోగదారులపై రూ.24.63 కోట్ల భారం పడనుంది.
ఇబ్బంది పడతాం
ఇప్పటికే పప్పులు, కూరగాయలు, నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ఇప్పడు గ్యాస్ ధర పెంచడంతో మా లాంటి పేదవారిపై మరింత భారం పడుతుంది. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి.
– బోడసింగి సీత, బోడసింగిపేట గ్రామం, బొండపల్లి మండలం
జీవించడం కష్టతరం
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల జీవించడం కష్టతరంగా మారింది. నూనె ధరలు పేదలు కొనుగోలు చేయ లేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం వల్ల మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
– ఎస్.రామునాయుడు,
గ్యాస్ వినియోగదారులు,
పెదవేమలిగ్రామం, గంట్యాడ మండలం

24.63

24.63

24.63