
ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్: మహిళ మృతి
● మరో నలుగురిరు మహిళలకు గాయాలు
రామభద్రపురం: మండలంలోని గొల్లలపేట గ్రామం వద్ద బుధవారం ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టగా జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అదే ఆటోలో ఉన్న మరో నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణితో ఉన్న ఓ మహిళను చూసేందుకు గొల్లలపేట గ్రామం నుంచి కొట్టక్కి గ్రామానికి ఆటోలో ఐదుగురు మహిళలు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా ఆ గ్రామం దాటాక సచివాలయం సమీపంలోని శ్మశానం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న బాలి లక్ష్మి(37) అక్కడికక్కడే మృతిచెందగా బాలి పద్మావతి, బాలి రమణమ్మ, లెంక సత్యవతి, బాలి వాసవిలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, మృతురాలి భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ వ్యవసాయకూలీ కాగా వారికి ఇద్దరు కుమార్తెలు లలిత, హేమ ఉన్నారు.

ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్: మహిళ మృతి

ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్: మహిళ మృతి