
ప్రత్యేకాధికారుల నియామకం..
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండల ప్రత్యేకాధికారులు ప్రతి శుక్రవారం మండలాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. మండల అభివృద్ధిపై వారు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారన్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలు తనిఖీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
నియోజకవర్గాల
ప్రత్యేక అధికారులు
పార్వతీపురం నియెజకవర్గానికి ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, పాలకొండ నియోజకవర్గానికి సబ్‌కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రోడ్డి, కురుపాం నియోజకవర్గానికి కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.ధర్మచంద్రా రెడ్డి, సాలూరు నియోజకవర్గానికి డ్వామా పీడీ రామచంద్రా రెడ్డిని నియమించారు.
’మున్సిపాల్టీల ప్రత్యేకాధికారులు
సాలూరు మున్సిపాల్టీకి డీవీఈఓ డి.మంజులావీణ. పార్వతీపురం మున్సిపాల్టీకి ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్, పాలకొండ మున్సిపాల్టీకి సీతంపేట ఏపీఓ జి.చినబాబులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.