మత్య్సశాఖ ఇన్‌చార్జి డీడీగా విజయకృష్ణ
విజయనగరం ఫోర్ట్: మత్య్సశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.విజయకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని మత్య్సశాఖలో ఏడీగా పనిచేస్తున్నారు. ఇక్కడ డీడీగా పని చేసిన నేతల నిర్మాలకుమారి జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై రాజమండ్రి బదిలీ అయింది.
కృత్రిమంగా పండించిన పండ్లను విక్రయిస్తే చర్యలు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం ఫోర్ట్: రసాయనిక పదార్థాలతో కృత్రిమంగా మగ్గించిన పండ్లను విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదుచేస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ హెచ్చరించారు. తన చాంబర్‌లో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమంగా పండించిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందన్నారు. సెప్టిక్ అల్సర్లు, తలనొప్పి, మైకం ఇతర న్యూరోలాజికల్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ కన్వీనర్‌గా జిల్లా సహాయఫుడ్ కంట్రోలర్ ఉంటారని, జిల్లా ఉద్యాన అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్, మార్కెటింగ్‌శాఖ ఏడీ సభ్యులుగా ఉంటారన్నారు.
నైపుణ్యంతోనే రాణింపు
చీపురుపల్లిరూరల్(గరివిడి): విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భవిష్యత్‌లో ఉన్నతంగా రాణిస్తారని తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జె.వి.రమణ తెలిపారు. గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల ద్వితీయ వార్షిక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాలలో నూతన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. పశు వైద్యాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు మూగజీవాలకు సేవ చేయాల్సి ఉంటుందని, అందుకు తగిన అన్ని రకాల శిక్షణ విద్యార్థి దశలోనే పొందాలన్నారు. క్రీడా విజేతలను పతకాలతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను, సీతం ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ శశిభూషణ్‌రావు, జిల్లా పశువైధ్యాధికారి వై.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్ మోహినికుమారి, తదితరులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ కోసం రోడ్డును తవ్వేశారు!
● ఆందోళనకు దిగిన గిరిజనులు
● వెనుదిరిగిన లే అవుట్ సిబ్బంది
శృంగవరపుకోట: ఓ ప్రైవేటు లే అవుట్ కోసం ఎస్.కోట మండలం ముషిడిపల్లి పంచాయతీలో చినఖండేపల్లి నుంచి చీడిపాలెం వెళ్లే రోడ్డును పొక్లెయిన్, జేసీబీతో శుక్రవారం తవ్వేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్కూల్ పిల్లల ఆటో వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల తరబడి గిరిజనులు రాకపోకలు సాగిస్తున్న రోడ్డును ఎలా తవ్వేస్తారంటూ లే అవుట్ సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామస్తుల కోసం మరో రోడ్డు వేస్తామని చెప్పినా ససేమిరా అనడంతో యంత్రాలను తీసుకుని అక్కడి నుంచి రియల్టర్లు పరారయ్యారు. రోడ్డు పనులు చేస్తున్న స్థలం గంట్యాడ రెవెన్యూ పరిధిలో ఉండడంతో వీఆర్వో గణపతి పరిశీలించారు. దీనిపై విచారణ జరుపుతామని గంట్యాడ తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి చెప్పారు.
మత్య్సశాఖ ఇన్‌చార్జి డీడీగా విజయకృష్ణ
మత్య్సశాఖ ఇన్‌చార్జి డీడీగా విజయకృష్ణ
మత్య్సశాఖ ఇన్‌చార్జి డీడీగా విజయకృష్ణ


