
40 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న నవోదయం 2.0 దాడుల్లో భాగంగా బుధవారం జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో 40 లీటర్ల సారాతో డి.సుందరం అనే వ్యక్తి పట్టుబడినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ వ్యక్తి వద్ద లభించిన సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. అలాగే సారా సరఫరా చేసే బొమ్మాళి అరుణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
వీరఘట్టంలో 60 లీటర్ల సారా..
వీరఘట్టం: మండలంలోని పొల్లరోడ్డులో బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వస్తూ బైక్ వదిలేసి ఓ వ్యక్తి పరారవడంతో సోదా చేసి బైక్‌పై ట్యూబ్‌లో 60 లీటర్ల సారా ఉన్నట్లు గుర్తించామని ఎస్సై జి,కళాధర్ తెలిపారు. సారాను స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేశామని ఎస్సై చెప్పారు. బైక్‌పై సారా తరలిస్తున్న వ్యక్తి స్థానిక కొండవీధికి చెందిన దుర్గారావుగా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.
అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ దాడులు
మెరకముడిదాం: మండలంలోని పలుగ్రామాల్లో వినియోగిస్తున్న అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బుదరాయవలస, సోమలింగాపురం, ఇప్పలవలస గ్రామాల్లో వ్యవసాయ పంపసెట్లకు అక్రమ విద్యుత్ కనెక్షన్లపై దాడులు నిర్వహించి, ఆయా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్న రైతులకు అపరాధరుసుం విధించారు. అలాగే పలు విద్యుత్ కనెక్షన్లను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు చిట్టితల్లి, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

40 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్