
పన్ను వసూళ్లపై దృష్టి పెట్టండి
విజయనగరం అర్బన్: నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్‌ఎస్‌డీటీలు, మండల సర్వేయర్లతో కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపన్ను, పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్, 22ఏ పెండింగ్ దరఖాస్తులు, రీవెరిఫికేషన్ ఆఫ్ హౌస్ సైట్స్, రెగ్యులరైజేషన్ ఆఫ్ హౌస్ సైట్స్, హౌస్‌సైట్స్ అసైన్మెంట్, ఫ్రీహోల్డ్ స్టేటస్, ఏపీసేవా సర్వీసెస్, రీసర్వే రెండవ దశపై మండలాల వారీగా సమీక్షించారు. పీజీఆర్‌ఎస్ వినతులు పెండింగ్ లేకుండా చూడాలని, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ అధికారులు సత్యవాణి, రామ్మోహన్, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్ వినతులు పెండింగ్
ఉండకూడదు
జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్