
జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఐశ్వర్య
విజయనగరం ఫోర్ట్: జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షరాలిగా ఐశ్వర్య యాదవ్ నియామితులయ్యారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆమెను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. జిల్లాలో మహిళల కోసం, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బ్యారేజీ దాటిన ఏనుగుల గుంపు
భామిని: మండలంలోని నేరడి బ్యారేజ్‌ను ఏనుగుల గుంపు శుక్రవారం దాటి వెళ్లింది. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణాగ్రతలకు ఏనుగుల గుంపు విలవిల్లాడుతోంది. సరైన చెట్ల నీడ లేకపోవడం, వేసవి తీవ్రత నుంచి ఉపశమనం లేకపోవడమే కారణమని ఫారెస్టు సిబ్బంది తెలిపారు. గురువారం రాత్రి బిల్లుమడ నుంచి నేరడి–బి మీదుగా వంశధార నదీ తీరం వెంబడి పయనించి శుక్రవారం నేడు నేరడి బ్యారేజీని ఏనుగులు దాటాయి. ఇదే నదీతీరంలో ఏపుగా ఉన్న జీడిమామిడి తోటలకు చేరుకున్నాయి.