
సమస్యలు చెప్పుకునే వేదిక వెల్ఫేర్ ‘డే‘
విజయనగరం క్రైమ్: వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వారి సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి శుక్రవారం తన చాంబర్‌లో పోలీస్ వెల్ఫేర్‌డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్‌జిందల్ చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులతో ప్రతివారం సంక్షేమ రోజును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్, ఏఆర్, ఫింగర్‌ప్రింట్స్, ఎస్టీఎఫ్, హోంగార్డ్స్, మినిస్టీరియల్ సిబ్బంది ఇలా ప్రతి ఒక్క ఉద్యోగి వారి పనుల్లో ఎదురయ్యే బదిలీలు, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్, వ్యక్తిగత, వృత్తిపరమైన వినతులను ఈ వెల్ఫేర్ డే సందర్భంగా తెలియజేయగా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.