ఎర్రచందనం స్మగ్లర్ల కోసం టాస్క్ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జీటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న 105మంది ఎర్రచందనం స్మగర్లను రైల్వే కోడూరులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో బడా స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం. వీరంతా తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు.స్మగర్లను తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించనున్నారు.