ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వేలం పాట మాదిరిగా చేశాయని ఆంధ్రయూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం శ్రీ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశాన్ని డబ్బుతో కొలవడానికి వీల్లేదని అదోరకమైన భావన అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజల నోళ్లు మూయించలేరని అన్నారు.