కూతురు అత్యాచారానికి గురైందని తెలిస్తే ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఆమెను కాటేసినవాడి కోరలు పీకేయాలనుకోడా? కానీ వీడు మాత్రం ఆ ఘటనను అవకాశంగా తీసుకుని కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు. ఒకటి, రెండు కాదు.. వారానికి నాలుగైదుసార్లు ఆమెపై విరుచుకుపడుతూ నాలుగేళ్లపాటు నరకం చూపించాడు. ఎలాగోలా తండ్రి చెర నుంచి పారిపోయిన కూతురు.. తండ్రిని శిక్షించాలంటూ కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం తుది తీర్పు వెల్లడించిన కోర్టు.. కనీవినీ ఎరుగని విధంగా నిందితుడికి 1503 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.