నగరంలోని సింగ్ నగర్ బుడమేరు వంతెన వద్ద ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ (16వ నెంబర్ సిటీ బస్సు) బీభత్సం సృష్టించింది. వాంబే కాలనీ నుండి ఆర్టీసీ బస్టాండుకు వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో బస్సు బుడమేరు వంతెనపై జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు ధ్వంసం కాగా ముగ్గురు దుర్మరణం చెందారు.