ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. అయితే ఈ సమస్యపై జీరో అవర్పై చర్చిద్దామని స్పీకర్ సూచనతో సభ్యులు శాంతించారు. దాంతో ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది.