Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Key Comments Over HCU Lands And Telangana Govt1
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.

Supreme Court to hear pleas against Waqf Amendment Act on Apr 16 Updates2
వక్ఫ్‌ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్‌ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్‌ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్‌సీపీ సైతం తన పిటిషన్‌లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ ఎంపీ మహ్మద్‌ జావేద్‌(బిహార్‌)తో పాటు జేడీయూ, ఆప్‌, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్‌ ఉలేమా హింద్‌, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్‌ న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్‌ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

Mirchi Farmers Protest AT guntur3
గుంటూరు మిర్చి యార్డ్‌ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్‌!

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్‌ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

KSR Comments On Chandrababu P-4 Concpet4
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్‌ అవుతున్నాడు.. మాస్టర్‌ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్‌ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్‌ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

In Front Of Their Faces: Shreyas Reveals How He Stumped Rahane KKR5
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్‌

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో గెలుపొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో మ్యాచ్‌లో ఇలాంటి విజయం ఎంతో ప్రత్యేకమని.. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గర్వాన్ని తలకెక్కించుకోనని చెబుతున్నాడు.111 పరుగులకే ఆలౌట్‌ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ మంగళవారం కేకేఆర్‌తో తలపడింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఆతిథ్య పంజాబ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, అనూహ్య రీతిలో 111 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (30) ఫర్వాలేదనిపించగా.. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్‌ కావడం తీవ్ర ప్రభావం చూపింది.కేకేఆర్‌ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లలో హర్షిత్‌ రాణా మూడు వికెట్లతో చెలరేగాడు. అన్రిచ్‌ నోర్జే, వైభవ్‌ అరోరా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.అంచనాలను నిజం చేస్తూ..టార్గెట్‌ పూర్తి చేసే దిశగా పయనిస్తున్న వేళ.. శ్రేయస్‌ అయ్యర్‌ తమ వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను రంగంలోకి దించాడు. అయ్యర్‌ అంచనాలను నిజం చేస్తూ.. కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (17), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (37), రింకూ సింగ్‌ (2), రమణ్‌దీప్‌ సింగ్‌ (0) రూపంలో చహల్‌ నాలుగు కీలక వికెట్లు కూల్చాడు. తద్వారా కేకేఆర్‌ బ్యాటింగ్‌ పతనాన్ని శాసించి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.అందుకే యుజీని పిలిపించాఈ క్రమంలో విజయానంతరం పంజాబ్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా మనసు చెప్పిన మాట విన్నాను. బంతి కాస్త టర్న్‌ అవుతుందని అనిపించింది. అందుకే యుజీని పిలిచి పని అప్పగించాను.సరైన సమయంలో సరైన ఆటగాళ్లను అటాక్‌ చేయాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని యుజీ చక్కగా అమలు చేశాడు. ఇలాంటి విజయాలు ఎంతో ప్రత్యేకం. అంతకంటే నేనేమీ ఎక్కువగా చెప్పలేను.నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వికెట్‌ అంత బౌన్సీగా అనిపించలేదు. అయితే, ఈ వికెట్‌పై మేము మెరుగైన స్కోరే సాధించామని అనుకుంటున్నా. అంతేకాదు పదహారు పరుగుల తేడాతో కేకేఆర్‌పై గెలిచాం కూడా.తప్పులు చేసే ఆస్కారం కల్పించాంయుజీ బంతితో రంగంలోకి దిగినప్పుడు మా అంచనాలు, ఆశలు మిన్నంటాయి. అతడు వాటిని నిజం చేశాడు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే తలంపుతో వాళ్ల కళ్లెదుటే ఫీల్డింగ్‌లో వడివడిగా మార్పులు చేస్తూ.. వాళ్లు తప్పులు చేసే ఆస్కారం కల్పించాం.ఈ విజయం ప్రత్యేకమైనదే అయినా గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఉండాలి. ఈ మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని స్వీకరిస్తూ.. తప్పులు సరిచేసుకుంటూ మరింత గొప్పగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌,. కానీ అతడిని రిటైన్‌ చేసుకోవడంలో కోల్‌కతా విఫలమైంది.కేకేఆర్‌పై ప్రతీకారం తీరింది!మెగా వేలంలోనూ పంజాబ్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిన సమయంలోనూ.. తమకు అవసరం లేదని విడిచిపెట్టింది. ఇక పంజాబ్‌ సారథిగా, బ్యాటర్‌ ఈ సీజన్‌లో శ్రేయస్‌ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో పంజాబ్‌ను నాలుగింట గెలిపించాడు. బ్యాటర్‌గా ఇప్పటికి 250 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందుకే ఈ విజయం అతడికి మరింత ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పాలా?!ఐపీఎల్‌-2025: పంజాబ్‌ వర్సెస్‌ కోల్‌కతాటాస్‌: పంజాబ్‌.. మొదట బ్యాటింగ్‌పంజాబ్‌ స్కోరు: 111 (15.3)కోల్‌కతా స్కోరు: 95 (15.1)ఫలితం: కోల్‌కతాపై 16 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం.చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. ఎట్టకేలకు పైసా వసూల్‌ ప్రదర్శన!.. చహల్‌ను హగ్‌ చేసుకున్న ప్రీతి జింటాMoments they will never forget 🤩🎥 All the 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling ending and memorable victory as #PBKS created history in front of a buzzing home crowd ❤🥳#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/mndhJxEt5X— IndianPremierLeague (@IPL) April 16, 2025

Chandrababu Govt Over Action On YS Jagan Tours6
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు

సాక్షి తాడేపల్లి: వైఎ‍స్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్‌ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ రాప్తాడులో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్‌ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్‌ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్‌ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్‌లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్‌ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్‌, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్‌ వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్‌ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Farmers Likely To Move High Court For Lands Captures Of Capital7
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

indian Railways trialed the ATM installed onboard a moving train8
రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు

రైల్లో ప్రయాణికులకు లిక్విడ్‌ క్యాష్‌ అవసరాలు తీర్చేందుకు, బ్యాంకింగ్‌ సర్వీసులు మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రముఖ బ్యాంకులు కొత్త సేవలు ప్రారంభిస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచించి రైలు ప్రయాణికులకు నేరుగా రైల్లోనే ఏటీఎం సేవలు అందించిందుకు సిద్ధమవుతున్నాయి. నాసిక్‌లోని మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్సెప్రెస్‌ ఏసీ బోగీలో ఇటీవల దేశంలోని మొదటి ఏటీఎం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ సహకారంతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.రైలు ప్రయాణంలో కొన్నిసార్లు సిగ్నల్‌ లేకపోవడం సహజం. దాంతో మన్మాడ్-ముంబై మధ్య ఇగత్పురి, కసారా సమీపంలోని కొన్ని సొరంగాల కారణంగా సిగ్నల్‌లో అవాంతరం చోటుచేసుకుందని ట్రయల్‌రన్‌లో గమనించినట్లు అధికారులు తెలిపారు. అది మినహా ట్రెయిల్‌ పరీక్ష సజావుగా సాగిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇదీ చదవండి: పది నిమిషాల్లో ఇంటికే సిమ్‌ కార్డులుఈ సందర్భంగా భుసావల్ డీఆర్ఎం పాండే మాట్లాడుతూ..‘ప్రజలు ఇప్పుడు కదిలే రైలులో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రైలులోని మొత్తం 22 బోగీలను వెస్టిబుల్స్(రెండు బోగీల మధ్య ప్రయాణించేందుకు వీలైన మార్గం) ద్వారా అనుసంధానం చేశాం. దాంతో ప్రయాణికులు ఏటీఎంను సులభంగా చేరుకోవచ్చు’ అని చెప్పారు. ప్రయాణికుడు సంజయ్ ఝా మాట్లాడుతూ ‘ఈ ఏటీఎం ద్వారా అన్ని సేవలు నిర్వహించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోవచ్చు. చెక్ బుక్ లను ఆర్డర్ చేయవచ్చు. స్టేట్‌మెంట్లను పొందవచ్చు. ప్రయాణ సమయంలో ఈ సర్వీసు చాలా తోడ్పడుతుంది’ అన్నారు.

Khushbu Sundar Hit Back Troll on Her Bold Transformation9
కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్‌ తీసుకుందని ట్రోలింగ్‌.. కౌంటరిచ్చిన నటి

పెరిగిన వయసును పైకి కనిపించకుండా దాచేయాలని చూస్తుంటారు సెలబ్రిటీలు. ఎప్పటికప్పుడు మరింత అందంగా, నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటారు. సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్బూ (Khushbu Sundar) కూడా తానింకా పడుచుదాన్నే అంటోంది. కాస్త సన్నబడిపోయి, షిమ్మరీ డ్రెస్‌తో హెయిర్‌ లీవ్‌ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి బ్యాక్‌ టు ద ఫ్యూచర్‌ అని రాసుకొచ్చింది.అంతా ఇంజక్షన్‌ మహిమ!ఇది చూసిన అభిమానులు ఖుష్బూ కొత్త లుక్‌ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత సన్నగా ఎలా అయింది? అయినా ఎంత సన్నబడ్డా నీ ముఖంలో ముసలితనం ఛాయలు కనిపిస్తున్నాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఇంకా హద్దులు మీరుతూ.. ఇంజక్షన్‌ మహిమ వల్లే ఇలా సన్నగా అయిపోయారు. నువ్వేం ఇంజక్షన్‌ తీసుకున్నావో ఫాలోవర్లకు చెప్పొచ్చుగా! అప్పుడు వాళ్లు కూడా అదే వాడతారు అని విమర్శించాడు.నువ్వో చెండాలం..ఇది చూసిన ఖుష్బూకు ఒళ్లు మండిపోయింది. మీలాంటివాళ్ల బాధేంటో నాకర్థం కాదు. మీరు సోషల్‌ మీడియాలో కనీసం ముఖాలు కూడా చూపించరు. ఎందుకంటే మీరు ఎంత చెండాలంగా ఉంటారో మీకు తెలుసు కాబట్టి! పాపం, మీ తల్లిదండ్రుల గురించి తలుచుకుంటేనే జాలేస్తోంది అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఘాటుగా రియాక్ట్‌ అయింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఖుష్బూ.. చివరగా వనవాస్‌ మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్‌ చేస్తోంది. అలాగే ఓ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl— KhushbuSundar (@khushsundar) April 15, 2025 చదవండి: ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు

Air Hostess molestation and abuse While On Ventilator In Gurugram Hospital10
ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!

మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చి ఒక హోటల్‌లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్‌ వీడియోతమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్‌, సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్‌ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement