పాపికొండల విహారానికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయల్ గోదావరి బోటు బయలుదేరింది. ఇందులో 90 మంది పెద్దలు కాగా.. 30 మంది పిల్లలున్నారు. వీరంతా బోటు ఎక్కాక గోదావరిలో 2 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేశాక పూడిపల్లి, వీరవరం లంక గ్రామాల మధ్యకు చేరేసరికి బోటులో మంటలు వ్యాపించాయి. కిచెన్ నుంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది