Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kapil Sibal on Vice Presidents judiciary remark1
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’

న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని , సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించబడిన పనులను ఆయా శాఖలు సరిగా చేయలేని పక్షంలో న్యాయవ్యవస్థ అనేది చూస్తూ కూర్చోదని స్పష్టం చేశారు. ఈ రోజు(శుక్రవారం) ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కపిల్ సిబాల్.. ‘కార్యనిర్వాహక శాఖ తన పని తాను చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది. అది ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు.కార్యనిర్వాహక శాఖ దాని పని అది చేయకపోతే అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది కోర్టులకు కల్పించబడ్డ ప్రాథమిక హక్కు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రంగా పని చేస్తుంది’ అని పేర్కొ‍న్నారు. ‘ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత రోజులల్లో దేశంలో ఎవరైనా దేనిపైనైనా నమ్మకం ఉంచుతున్నారంటే అది న్యాయవ్యవస్థే. మన దేశంలో రాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నామమాత్రంగానే వ్యవరిస్తారు. కేవలం క్యాబినెట్ సలహాలతోనే రాష్ట్రపతి ముందుకు వెళతారు. అంతేకానీ ఇక్కడ రాష్ట్రపతికి ఎటువంటి వ్యక్తిగత అధికారాలు లేవు’ అని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.జగదీప్‌ ధన్‌ఖడ్ ఏమన్నారంటే..రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు.

Heavy Rain In Many Parts Of Hyderabad2
హైదరాబాద్‌లో కుండపోత వర్షం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్‌, నార్సింగి, కోకాపేట్‌, కోఠి, నాంపల్లి, అబిడ్స్‌ దిల్‌సుఖ్‌నగర్‌, రాజేంద్రనగర్‌, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో దంచికొడుతుంది. పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రానికి వర్షాలు.. ఈదురుగాలులు, వడగడ్ల వానలతో జనం పరేషాన్ అవుతున్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీయ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదగా ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీతో వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు రోజులు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని పలు ఉత్తర, ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

IPL 2025: MI Take Top Position In A Rare IPL Chasing Record, Surpass KKR With Win VS SRH3
IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్‌ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్‌, కమిన్స్‌ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 40, ట్రవిస్‌ హెడ్‌ 28, ఇషాన్‌ కిషన్‌ 2, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 19, క్లాసెన్‌ 37, అనికేత్‌ 18 (నాటౌట్‌), కమిన్స్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్‌ జాక్స్‌ 2, బౌల్ట్‌, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 31, రోహిత్‌ శర్మ 26, విల్‌ జాక్స్‌ 36, సూర్యకుమార్ యాదవ్‌ 26, హార్దిక్‌‌ 21, తిలక్‌ 17 (నాటౌట్‌) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, ఎషాన్‌ మలింగ 2, హర్షల్‌ పటేల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్‌ జాక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్‌లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్‌- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)కేకేఆర్‌- ఈడెన్‌ గార్డెన్స్‌- 28 (40)రాజస్థాన్‌ రాయల్స్‌- సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఉప్పల్‌ స్టేడియం- 21 (32)సీఎస్‌కే- చెపాక్‌ స్టేడియం- 20 (31)

Subramanian Swamy Serious On TTD Chairman Over Goshala Row4
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.

Infosys To Hire 20000 Fresh Engineering Graduates in FY265
'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్ఫోసిస్‌లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.నియామకాల అంచనాజీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలుగతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్‌ సాధించింది.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్‌ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే!

A Woman Hyderabad Creates Drama After Jumping pff MMTS6
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. విచారణలో షాకింగ్‌ విషయాలు చెప్పిన యువతి

హైదరాబాద్‌: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్‌ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులుఅత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్‌ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్‌ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ రిపేర్‌ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తెల్లాపూర్‌– మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్‌ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది.

Land Grabbing By Alliance Leaders In Jammalamadugu7
భూ దందా.. జమ్మలమడుగులో ‘బాబాయ్‌-అబ్బాయ్‌’ రాజ్యాంగం

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగులో కూటమి నేతల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. తాము చెప్పిందే వేదమంటూ ప్రభుత్వ భూమిని టీడీపీ యువనేత ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. నిన్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమ వివాదంలో బాబాయ్ ఎంట్రి ఇవ్వగా.. అది మరువక ముందే మరొక భూదందాకు అబ్బాయ్‌ తెరలేపారు. బాబాయ్, అబ్బాయ్‌లు కలిసి దోచేసుకుంటున్నారు.పెద్ద ముడియం మండలం పాపాయపల్లిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేయించిన టీడీపీ యువనేత.. ఆ ప్రాంతంలో ఏర్పాటైన సోలార్‌ కంపెనీకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేందుకు కబ్జాకు తెరతీశారు. ఎకరా రూ.6 లక్షల చొప్పున సదరు కంపెనీకి ప్రభుత్వ భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.ఎన్వోసీలు తీసుకురావడం, చదును చేయడం అంతా మా పనేనంటున్న యువనేత.. 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు కంపెనీ అప్పనంగా అమ్మేస్తున్నారు. ఆ 500 ఎకరాల్లో పేదలకిచ్చిన డీకేటీ పట్టాలున్నా, వాటిపై కోర్టులో కేసు ఉన్నా టీడీపీ యువనేత పట్టించుకోవడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదని తహశీల్దార్‌ చెబుతున్నారు. తమ భూములను దౌర్జన్యంగా చదును చేస్తున్నారంటు డీకేటీ పట్టాదారులు వాపోతున్నారు.

BJP MLA Raja Singh Skips BJP Meeting Again8
రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్‌ చెప్పకపోవడంగా సమాచారం. ప్రత్యర్థి పార్టీలో సీఎంగా ఉన్న సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్‌ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.

GVMC Motion Updates: YSRCP Coporators Shocks Kutami Leaders9
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు

విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

Kesari Chapter 2 Ananya Panday  amzing saree Looks 10
Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్‌ కలర్‌ చీరలో అమేజింగ్‌ లుక్స్‌

బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్‌ చీరను ధరించి స్పెషల్‌ లుక్‌లో అలరించింది.ప్రీమియర్ రెడీ లుక్‌తో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్‌ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్‌ అండ్‌ మిర్రర్‌వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకుంది. బ్యాక్‌లెస్ అండ్‌ హాల్టర్ నెక్ బ్లౌజ్‌ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్‌కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)కేసరి చాప్టర్ 2బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్‌ కుమార్‌ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్‌ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్‌లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement