రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాలను ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకునే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. గత నెల 30న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందామని, ఏపీ ప్రగతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించిన విదితమే.