ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆయనపై శ్రీనివాసరావు అలియాస్ చంటి కత్తితో దాడికి పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. జగన్‌ను అంతమొందించాలనే మెడపై పొడిచేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించాడని, ఈ ప్రక్రియలో జగన్‌కు తన ఎడమ చేయి పై భాగంలో గాయమైందని స్పష్టం చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఉండదని, అందువల్ల నిందితుడు సెల్ఫీ పేరుతో లోనికి ప్రవేశించాడని తెలిపింది. జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాసరావు సరైన సమయం కోసం ఎదురు చూశాడని వివరించింది.