రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ డబ్బుల్ని బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు, డ్వాక్రా సభ్యులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.