తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు.