ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో అధికార పార్టీపై ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీడీపీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ‘ఎర్రర్’ అని చూపిస్తోంది. టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది.