ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, కుల,మత, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్ అని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు పాలనలో రైతులకు దగా చేశారని, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు.