ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకి ప్రజలు గుర్తుకొస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే.. పథకాలను ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా మభ్యపెట్టే పథకాలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు.