Top Stories
ప్రధాన వార్తలు

పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి అక్కడ పనిచేసే ఓ కేక్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.VIDEO | Amritsar, Punjab: Pakistani national reach Attari-Wagah border to return to their country after India suspended the SAARC visa exemption scheme (SVES) asking Pakistani citizens in India under SVES visa to leave the country within 48 hours. The decision was taken the… pic.twitter.com/0CVYTaJcBU— Press Trust of India (@PTI_News) April 24, 2025

బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్‌కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్‌కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్‌లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ పవర్ ఫుల్‌గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్‌కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్ గత ప్రభుత్వ టైమ్‌లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్‌కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్‌కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది. 1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది. 1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.:::జమ్ముల శ్రీకాంత్ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?

IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్‌తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్‌తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్‌లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు

బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. ఈ మిగిలిన రోజుల్లో ఏప్రిల్ 30 వరకూ దేశంలోని బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ వారాంతపు సెలవులైన నాలుగో శనివారం, ఆదివారంతోపాటు విశేష దినోత్సవాల సెలవులూ ఉన్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.దేశంలో బ్యాంకులకు సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయిస్తుంది. స్థానిక పండుగలు, విశేష సందర్భాల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఈ సెలవులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది.రానున్న బ్యాంక్ సెలవుల జాబితా» ఏప్రిల్ 26న నాలుగో శనివారం, గౌరీ పూజ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.» ఏప్రిల్ 27న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.» ఏప్రిల్ 29న పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు.» ఏప్రిల్ 30న కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు మూతపడనున్నాయి.ఈ సెలవులు ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపినప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.

పాక్‌ను దెబ్బ కొట్టాల్సిందే! భారత్ కౌంటర్ యాక్షన్స్
జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ రలిగిపోతోంది. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నందుకు పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తోంది. ఈ క్రమంలో.. త్వరలోనే దీటైన ప్రతీకారం తప్పదని భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.హోం శాఖ హైలెవల్ మీటింగ్కొనసాగుతున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశంపహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీటింగ్సమావేశంలో పాల్గొన్న హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, ‘రా’ చీఫ్ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ పహల్గాం ఉగ్రదాడిపై సీడబ్ల్యూసీ చర్చసమావేశానికి హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, జైరాం రమేష్అమెరికా పర్యటన ముగించుకుని అర్ధాంతరంగా వచ్చిన రాహుల్ఉగ్రదాడిపై అమిత్ షాతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసాయంత్రం అఖిలపక్ష భేటీకి హాజరయ్యే అవకాశంకశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాళ్ల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లుకశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు9440816071, 9010659333, 040 23450368కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు: జూపల్లి కృష్ణారావుఇటీవల జమ్మూకశ్మీర్ వెళ్లినవారి వివరాలు ఇవ్వాలని టూర్ ఆపరేటర్లకు ఆదేశాలు పాక్ మిలిటరీ దౌత్యవేత్తకు భారత్ సమన్లుపాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ జారీఈ నోటీసుల ప్రకారం ఒక వారంలో వారు దేశాన్ని వీడాల్సి ఉంటుందని తెలిపిన భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీఢిల్లీలో పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తతఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలతో ఉద్రిక్తతహిందూ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలుపాకిస్తాన్ నశించాలి అంటూ నినాదాలు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ వక్రబుద్ధి బయటపెట్టిన పాక్పహల్గాం ఉగ్రదాడిపై సంబురాలు చేసుకున్న పాక్?ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్లిన పాక్ ప్రతినిధిఎందుకు అని ప్రశ్నించిన మీడియాకు సమాధానం చెప్పని వైనం పీవోకేలో భారత ఆర్మీ వ్యూహరచనపీవోకే వెంట 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లుపీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దృష్టివ్యూహ రచనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు వివరించిన ఆర్మీ పాక్ ఎక్స్ ఖాతా నిలిపివేతఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేసిన భారత్దౌత్యపరమైన ఆంక్షల్లో భాగంగానే ఈ చర్య భద్రతా వలయంలో పహల్గాంమంగళవారం పహల్గాం బైసరన్ వ్యాలీ పిక్నిక్ స్పాట్లో ఉగ్రదాడిసైనిక దుస్తుల్లో వచ్చిన గుర్తింపు తనిఖీలు చేసి మరీ పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు26 మంది స్పాట్లో.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతితీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరికొందరుప్రశాంత లోయలో ఉగ్రదాడితో ఉలిక్కి పడ్డ భారత్నాటి నుంచి భద్రతా వలయంలో పహల్గాంహోటల్స్, లాడ్జిలను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలుపాక్ హైకమిషనర్‌కు కేంద్రం సమన్లువారంలోగా భారత్ విడిచిపోవాలని అల్టిమేటందౌత్యవేత్త అహ్మద్ వారైజ్తో పాటు పలువురు సిబ్బందికి కేంద్ర నోటీసులు జారీహైకమిషనరేట్ కార్యాలయం ముందు బారికేడ్లను తొలగించిన సిబ్బందిఆఫీస్లోని సామాగ్రి సైతం తీసుకెళ్తున్న సిబ్బందిక్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్కరాచీ తీరంలో క్షిపణి పరీక్షలు నిర్వహణకు పాక్ ప్రభుత్వ ఆదేశాలుపాక్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ఉదమ్పూర్ ఉగ్రవాదుల దుశ్చర్యఉదమ్పూర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులుఆర్మీ జవాను మృతి చెందినట్లు ప్రకటించిన భారత సైన్యంకొనసాగుతున్న ఎదురు కాల్పులు

ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
ములుగు, సాక్షి: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. మాకేం సంబంధం లేదుకర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్‌కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్‌లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.కూంబింగ్ సరికాదుఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.

Vaisakha Masam పర్వదినాల వైశాఖ : ఎన్ని విశేషాలో!
28, సోమవారం నుంచి మే 27, మంగళవారం వరకు వైశాఖమాసంసంవత్సరంలోని అన్ని మాసాలూ విశిష్టమైనవే అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి మనది. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన వైశాఖమాసంలో స్నానానికి, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మపురాణం చెబుతోంది. నెలంతా స్నానం చేయలేనివారు కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో స్నానం చేసినా సకలపాపాల్ని నివృత్తి అవుతాయి. స్నానం తర్వాత త్రికరణశుద్ధిగా విష్ణుపూజ చేయాలి. అట్లాగే యథాశక్తి ఏకభుక్తం, నక్తం ఆచరించేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖ పురాణం చెబుతోంది. పాలిచ్చే ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం– ఇవన్నీ గురువుకి దానంగా ఇవ్వాలి. అశక్తులైనవారు చలివేంద్రాలు నిర్వహించటం, పరమశివునికి నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాట్లు చేయడం, పితృదేవతల తృప్తి కోసం చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది.ఈ మాసం ఈ పర్వదినాలు... అక్షయతృతీయ...వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అంటారు. ఈరోజున చేసే పూజలు, హోమం, దానం, పితృ తర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టే దీనికా పేరొచ్చింది. ఈ పర్వదినాన నీటితో నింపిన కుండ, గోధుమలు, శనగలు ధాన్యాలు, పెరుగన్నం దానం చేయటం వల్ల శాశ్వతంగా శివ సాయుజ్యాన్ని పొందవచ్చని పురాణోక్తి. అదేవిధంగా గొడుగు, ΄ాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేయటం ఎంతో పుణ్యప్రదం.పరశురామ జయంతి...శ్రీమహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతిగా చెప్పబడుతోంది. వైశాఖ శుక్ల తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో రాత్రి సమయంలో సాక్షాత్తూ ఆ హరియే పరశురాముడిగా రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించాడు. అంతటి మహా తపశ్శాలి జయంతిని మనం యుగయుగాలుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచారాలతో పూజించిన వారికి శత్రు పీడ ఉండదని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. గంగోత్పత్తి...గంగోత్పత్తి అంటే గంగాదేవి ఆవిర్భవించటం లేదా అవతరించటం. వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి అని పృథ్వీచంద్రోదయ గ్రంథం చెబుతోంది. వైశాఖ శుక్ల సప్తమిన జహ్ను మహర్షి కోపంతో గంగను తాగాడు. తన కోపం చల్లారాక మళ్ళీ కుడిచెవి నుండి వదిలిపెట్టాడు. ఈ కారణంగా ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గంగాదేవిని స్మరిస్తూ పుణ్య నదుల్లో పవిత్ర స్నానం చేస్తే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదీ వీలు కానప్పుడు చెరువు వద్ద లేదా కాలువ వద్ద గంగను ధ్యానిస్తూ స్నానాలాచరించవచ్చు. హనుమజ్జయంతి...శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడు – చైత్ర పౌర్ణమినాడు జన్మించినట్లు పలు గ్రంథాలు చెబుతున్నాయి. కాగా పరాశర సంహిత వైశాఖ బహుళ దశమిని ఆంజనేయుడి జన్మదినంగా పేర్కొంటోంది. అందుకే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి జరుపుకుంటూ ఉండగా, ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని హనుమజ్జయంతిగా భావించి వేడుకలు జరుపుతారు. ఈరోజున ఆంజనేయస్వామిని పూజించటం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలగి, గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. హనుమజ్జయంతినాడు సుందరకాండ, హనుమాన్ చాలీసాపారాయణ చేయడం మంచిది. ఈ రోజు శ్రీ సీతారామచంద్రులను పూజించడం వల్ల హనుమంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందవచ్చు. నృసింహ జయంతి...వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. నృసింహ జయంతినాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసిపానకం–వడపప్పు, చక్ర పొంగలి–దద్ధ్యోదనం నివేదిస్తే స్వామి వారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయని ప్రతీతి. వైశాఖ పూర్ణిమ– బుద్ధ పూర్ణిమ...లోకంలోని ప్రజల దుఃఖ నివారణకోసం, శాంతిని నెలకొల్పటం కోసం గౌతముడు శుద్ధోదన చక్రవర్తికి, మహామాయకు జన్మించిన వైశాఖ శుద్ధ పూర్ణిమకే బుద్ధజయంతి అని పేరు. గౌతముడు బుద్ధుడిగా పరివర్తన చెందిన ఈ రోజుకే బుద్ధపూర్ణిమ అని కూడా పేరు.వైశాఖ శుద్ధ దశమి – శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి... తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు వారి కులదైవం అయిన వాసవీ మాత ఎంతో ముఖ్యం. అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధదశమి నాడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి సుమారు వెయ్యేండ్ల క్రితం పెనుగొండలో ‘కుసుమ శ్రేష్టి’, కుసుమాంబ పుణ్యదంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం నాడు జన్మించింది.వైశాఖ శుద్ధ ఏకాదశి – మోహినీ ఏకాదశి...ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణు లోక ప్రవేశం కలుగుతుందని పురాణ వచనం.వైశాఖ పూర్ణిమ – మహావైశాఖి...వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపాన్ని శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు. ఈ వేళ శ్రీకూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం సత్ఫలితాలనిస్తుంది.వైశాఖ శుద్ధ పూర్ణిమన్నమయ్య జయంతి...తెలుగులో తొలి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 32 వేల కవితలతో సంకీర్తనలు సమర్పించిన పద కవితా పితామహుడు తాళ్ల΄ాక అన్నమాచార్యుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు నందక ఖడ్గం అంశగా నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు జన్మించిన పర్వదినం వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు.శంకర జయంతి... రామానుజ జయంతి...వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యుల వారు జన్మించిన అత్యంత విశిష్టమైన తిథి. ఈ రోజున వైష్ణవులు తప్పనిసరిగా రామానుజుల జయంతిని వైభవంగా జరుపుకుంటే, వైదిక మతానుసారులు శంకర జయంతిని చాలా నిష్ఠగా జరుపుకుంటారు. వైశాఖ బహుశ విదియ– నారద జయంతి...బ్రహ్మ మానస పుత్రుడు, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు, అనుక్షణం నారాయణ నామస్మరణతో ఆనంద పారవశ్యుడయ్యే నారదుడు పుట్టిన ఈ పర్వదినాన ఆయన పేరు మీదుగాపాత్రికేయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ప్రతీతి. నారాయణ లోక కల్యాణం కోసం కలహ భోజనుడిగా పేరు తెచ్చుకున్న నారద మహర్షిని స్మరించు కోవడం చాలా మంచిది.వైశాఖ బహుళ ఏకాదశి– నిర్జల ఏకాదశి...ఈరోజు చుక్క నీటిని కూడా తాగకుండా ఉపవసించిన వారి పట్ల ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు సకల సంపదలు కలిగించి, అంతిమాన మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. వైశాఖ శుద్ధ దశమి– అన్నవరం సత్యదేవుని కల్యాణ మహోత్సవం...తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ రమాదేవి అమ్మవార్లతో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ పుణ్య స్థలంలో వెశాఖ శుద్ధ దశమినాడు సీతారాములే పెళ్లిపెద్దలుగా సత్యదేవుని వివాహం కన్నుల పండువగా జరుగుతుంది.

బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu

పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్‌పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.తీవ్రంగా ఖండిస్తున్నా..ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.దుష్ప్రచారందీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.నా రక్తంలోనూ..USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
పహల్గాం మృతులకు వైఎస్ జగన్ నివాళి
శివ శంభో లాంటి సినిమాలను గౌరవించాలి: గోరటి వెంకన్న
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ఇషాన్ కిషన్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
పహల్గాం దాడి.. సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
మళ్లీ ఉగ్ర కాండ!
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పక్కా కక్షే... అక్రమ కేసే
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
గన్నవరం విమానాశ్రయం రికార్డు
65 దాటితే 'నో' పదవి
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
రెడ్‌బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
‘పది’పోయిన ఫలితాలు
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
3 నిమిషాల్లో!
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
సంచలన విజయం దిశగా జింబాబ్వే
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
పోలవరం ఎత్తు కుదింపు
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
జగిత్యాలకు రెడ్ అలర్ట్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
చిన్నస్వామిలో చిందేసేనా!
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
విశ్వసనీయ మిత్రదేశం
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
పహల్గాం మృతులకు వైఎస్ జగన్ నివాళి
శివ శంభో లాంటి సినిమాలను గౌరవించాలి: గోరటి వెంకన్న
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ఇషాన్ కిషన్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
పహల్గాం దాడి.. సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
మళ్లీ ఉగ్ర కాండ!
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పక్కా కక్షే... అక్రమ కేసే
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
గన్నవరం విమానాశ్రయం రికార్డు
65 దాటితే 'నో' పదవి
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
రెడ్‌బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
‘పది’పోయిన ఫలితాలు
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
3 నిమిషాల్లో!
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
సంచలన విజయం దిశగా జింబాబ్వే
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
పోలవరం ఎత్తు కుదింపు
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
జగిత్యాలకు రెడ్ అలర్ట్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
చిన్నస్వామిలో చిందేసేనా!
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
విశ్వసనీయ మిత్రదేశం
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సినిమా

భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ నటుడు నాజర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ది అకాలీ'(The Akaali).. ఏడాది క్రితం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలో రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీలో కథ, కథనాలతో పాటు భారీ ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా నాజర్ పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో నాజర్‌తో పాటు వినోద్ కిషన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మహ్మద్ అసిఫ్ హమీద్ హారర్ థ్రిల్ మూవీగా దీనిని తెరకెక్కించారు.సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. అయితే, ఇప్పటికే తమిళ వర్షన్ ఆహా(AHA) ఓటీటీలో రావడంతో చాలామంది చూసిన తర్వాత మూవీ బాగుందంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదే ఓటీటీలో ఈ నెల 26 నుంచి తెలుగు ఆడియో అందుబాటులో ఉండనుంది. డార్క్ హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలు చేస్తుంటుంది. అందులో దాగి ఉన్న మిస్టరీని ఛేదించేందుకు హమ్జా అనే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. సంబంధిత కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. ఈ కేసు విషయంలో అతను తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి..? మరి, జానిస్ ఎందుకు మర్డర్స్ చేయాల్సి వచ్చింది..? జానిస్ పూజలను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? వంటి అంశాలు ఆసక్తిని పెంచుతాయి.

అలాంటి సినిమాలు చేయను : వశిష్ట ఎన్. సింహ
‘‘హారర్, కాలేజ్ లవ్‌స్టోరీ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే సమయం వృథా చేసుకోవద్దని చెబుతాను. ‘ఓదెల 2’ చిత్రం హారర్ ఫిల్మ్ కాదు.. దైవానికి, దుష్ట శక్తికి మధ్య వైరం. ఈ మూవీలో నేను ఓ ఆత్మ పాత్ర చేశాను. హీరో, విలన్ అని కాదు.. ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని వశిష్ఠ ఎన్ . సింహా (Vasishta N. Simha) చెప్పారు. తమన్నా భాటియా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’(Odela 2 Movie). దర్శకుడు సంపత్‌నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వశిష్ట ఎన్ . సింహా బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కిరాక్ పార్టీ’ (2018) సినిమాలోని ‘నీచమైన..’ అనే పాటను పాడి, సింగర్‌గా తెలుగులోకి వచ్చాను నేను. కన్నడలో నన్ను సింగర్‌గా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్గారే తెలుగులోనూ గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమా తర్వాత ఓ రోజు సంపత్ నందిగారు కాల్ చేసి, ‘ఓదెల 2’ గురించి, నా పాత్ర గురించి చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఈ తరహా దెయ్యం పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలోని సమాధి శిక్ష సీక్వెన్స్ సవాల్‌గా అనిపించింది. ‘ఓదెల 2’ లో స్క్రీన్ పై తిరుపతి ఉన్నా లేకపోయినా అతని నామస్మరణ మాత్రం సినిమాలోని క్యారెక్టర్స్ చెబుతూనే ఉంటాయి. అలా ఈ సినిమాకు ఎవరైనా హీరో ఉంటే అది తిరుపతి పాత్రే. తమన్నాగారు నాగసాధువుగా అద్భుతంగా నటించారు. సంపత్‌నందిగారు ‘ఓదెల 2’ కథను అద్భుతంగా రాశారు. అశోక్ తేజ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. డి.మధుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్ నన్ను గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలని ఉంది’’ అని అన్నారు.

పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
గాయని ప్రవస్తి (Pravasthi) రీసెంట్గా ఒక వీడియోతో సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పాలని ఆమె కోరారు. మూడురోజులుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం చుట్టూ పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న జడ్జెస్ వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేశారు. వారికి నచ్చన కంటెస్టెంట్స్ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తనను బాడీషేమింగ్ కూడా చేశారని ఆమె అన్నారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని సింగర్ సునీత ఒక వీడియోను విడుదల చేశారు. ఆపై వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అయితే, ప్రవస్తి గురించి కాదు. మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్ ఇచ్చే లిరిక్స్‌తో ఆ పాట ఉంది. గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలోని సాంగ్‌ను ఆమె పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్ అందులో ఉన్నాయి. సింగర్ ప్రవస్తి గురించే సునీత ఈ పాటను పోస్ట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) ప్రోగ్రాం వల్ల తెలుగు చిత్రపరిశ్రమకు చాలామంది సింగర్స్ పరిచయం అయ్యారు. ఒకరకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది నేడు రాణిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వేదిక మీద తమ గాత్రాన్ని వినిపించాలని పోటీ పడిన సింగర్స్ ఎందరో ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం ‘పాడుతా తీయగా’ జడ్జెస్‌గా ఉన్న సునీత, కీరవాణి, చంద్రబోస్లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది. జడ్జిమెంట్ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి తెలిపింది. కొందరి కంటెస్టెంట్స్ పట్ల జడ్జెస్ చాలా బాగుంటారని, వారు తప్పుగా పాడినా ఫైనల్ వరకు తీసుకొచ్చారని కొన్ని ఆధారాలతో ప్రవస్తి బయటపెట్టింది. అయితే, సింగర్ సునీత, నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్స్టాప్ పెట్టినట్లు ఉన్నారు. జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

వాటి కంటే అభిమానులే నాకు ముఖ్యం: సాయిపల్లవి
మాలీవుడ్‌లో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్‌తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి. మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్‌తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు
క్రీడలు

SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్‌ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్‌గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్‌గా గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.

ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
కశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం జరిగిన భయానమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. లష్కరే-తోయిబాకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించాడు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయిని నిలదీశాడు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, పెంచి పోషిస్తుందని ఆరోపించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా పాక్ ప్రభుత్వంపై అసహనాన్ని ప్రదర్శించాడు.Why is it that they never target local Kashmiris, but consistently attack Hindus — be it Kashmiri Pandits or Hindu tourists from across India? Because terrorism, no matter how it’s disguised, follows one ideology — and the whole world is paying the price for it. #Pahalgam— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025దీనికి ముందు కూడా కనేరియా ఓ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీలను ఎందుకు టార్గెట్ చేయరని ప్రశ్నించాడు. హిందువులే లక్ష్యంగా ఎందుకు దాడులకు తెగబడతారని నిలదీశాడు. ఉగ్రవాదం కారణంగా యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకుంటుందని వాపోయాడు.తాజాగా కనేరియా మరో ట్వీట్ కూడా చేశాడు. నేను ఏదైనా ట్వీట్ చేసినప్పుడల్లా కొంతమంది భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడతారని ప్రశ్నించాడు.Why do some Indian Muslims get offended whenever I tweet something? Genuinely curious — just asking.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 202544 ఏళ్ల కనేరియా పాక్ తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందు ఆటగాడు. గతంలో అతని కజిన్ అనిల్ దల్పత్ పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కనేరియా 2000-2019 మధ్యలో పాక్ తరఫున 61 టెస్ట్‌లు ఆడి 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. కనేరియా హిందువన్న కారణంగా పాక్ క్రికెట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను టీమ్‌లో ఉండటం చాలామంది పాక్ క్రికెటర్లకు నచ్చేది కాదని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్వయంగా చెప్పాడు. కనేరియా స్పాట్ ఫిక్సంగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ మరియు ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కనేరియా ఆ దేశాన్ని విడిచి వెళ్లాడు. ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు.Sad & heartbroken 💔 #PahalgamTerroristAttack— Mohammad Hafeez (@MHafeez22) April 23, 2025కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కూడా స్పందించాడు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ విచారం వ్యక్తం చేశాడు.

SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్‌రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్‌రైజర్స్ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్‌తో (22) పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్లో ముంబై వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్‌ను చివరి (ఐదో) టైటిల్.
బిజినెస్

భారత వృద్ధి రేటుకు కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) తగ్గిస్తున్నట్టు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. 6.7 శాతం వృద్ధి నమోదు కావచ్చన్న గత అంచనాలను 6.3 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక బలహీనత, విధానపరమైన అనిశి్చతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘2024–25లో భారత వృద్ధి రేటు నిరాశపరిచింది. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం ఇందుకు దారితీసింది. భారత జీడీపీ వృద్ధి 2024–25లో ఉన్న (అంచనా) 6.5 శాతం స్థాయి నుంచి 2025–26లో 6.3 శాతానికి నిదానించొచ్చు. ప్రైవేటు పెట్టుబడులు, ద్రవ్యపరమైన సడలింపులు, నియంత్రణ పరమైన సానుకూలతలను.. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీనత, విధానపరమైన (వాణిజ్యం) అనిశి్చ తులు తటస్థం చేయొచ్చు’’అని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వివరించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం భారత జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో వేసిన 6.5% నుంచి 6.2 శాతానికి తగ్గించడం గమనార్హం. ‘‘పన్ను తగ్గింపులతో ప్రైవేటు వినియోగం పుంజుకోవచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా పెరుగుతాయి. కానీ, అంతర్జాతీయంగా వృద్ధి నిదానించడం, వాణిజ్య విధానాల్లో మార్పులతో ఎగుమతుల డిమాండ్ తగ్గుతుంది’’అని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి దక్షిణాసియా వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని పేర్కొంది. 2025లో దక్షిణాసియా ప్రాంతంలో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను 5.8 శాతానికి కుదించింది.

ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్ రేటింగ్స్ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది. ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్ 5’ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్ ‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్‌ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది.

యాపిల్, మెటాకు వేలకోట్ల జరిమానా
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్, మెటాకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వందల మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.యాపిల్ సంస్థకు 570 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.48,64,61,08,500).. మెటాకు 228 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19,45,92,38,025) జరిమానా విధించింది. ఈ భారీ జరిమానాలు యూరోపియన్ యూనియన్ & ట్రంప్ పరిపాలన మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికా కంపెనీలపై జరిమానా విధించే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారులను.. ఐఫోన్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా.. ఇతర యాప్‌లను డౌన్లోడ్ చేయడానికి వీలు లేకుండా పరిమితులు విధించినట్లు యూరోపియన్ యూనియన్ తన పరిశోధనలో తేల్చింది. ఇది డీఎంఏ చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగానే జరిమానా విధిస్తున్నట్లు ఈయూ పేర్కొంది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ కారణంగానే ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించలేదని యాపిల్ స్పందించింది. అంతే కాకుండా తమ టెక్నాలజీని ఉచితంగా ఇవ్వాలని ఈయూ చెబుతోందని.. ఈ కారణంగానే సంస్థను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ఇక మెటా విషయానికి వస్తే.. తన సొంత ప్లాట్‌ఫామ్‌లలో వారి వ్యక్తిగత డేటాను కలపకుండానే తన సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించాల్సి వచ్చింది. అయితే, DMA నిబంధనల ప్రకారం అలా చేయడంలో విఫలమైంది. ఈ కారణంగానే జరిమానా పడింది. ఈ అంశంపై తాము కూడా సవాలు చేస్తామని మెటా పేర్కొంది.

కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.రూ.300 జీతానికిసాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.ప్రపంచంలో 138వ ధనవంతుడిగారిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయితవారసులకు ఏమిచ్చారు?ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు.
ఫ్యామిలీ

పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం (Pahalgam terror attack) పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా చేసిన దాడిలో అనేకమంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసరాన్‌కు విహార యాత్ర కోసం వచ్చి, ప్రకృతి అందాల మధ్య సేద తీరుతున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు. ఆనందంగా గడుపుతూ తమతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే తమ ఆప్తులు విగతజీవులుగా మారిన ఘటన పర్యాటకుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగుచూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో అమెరికాలో ఉంటున్న 40 ఏళ్ల టీసీఎస్‌కు చెందిన టెకీ బితాన్ అధికారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని బ్రాండన్‌లో నివసిస్తున్న బితాన్ ఈ నెల ప్రారంభంలో భార్య సోహిని ,మూడేళ్ల కుమారుడితో కలిసి కోల్‌కతాకు వచ్చిన టీసీఎస్ ఉద్యోగి విహార యాత్ర విషాదంగా ముగిసింది. మంగళవారం నాడు ఆయన కూడా ఉగ్రతూటాలకు బలైనారు. ఈ దాడిలో బితాన్ భార్య సోహిని ,కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. లాన్‌మీద కూర్చని ఉన్నాం...అకస్మాత్తుగా సాయుధ వ్యక్తులు వచ్చి హిందువు,ముస్లిం ఎవరు అని అడిగారు.. ఎటూ కదలడానికి కూడా అవకాశమివ్వలేదు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.దీంతో నా భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయారంటూ విలపించింది. ఈ గురువారం తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది..ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీటి పర్యంతమైంది. టీసీఎస్‌లో ఉద్యోగ రీత్యా 2019లో అమెరికాకు వెళ్లారు బితాన్ అధికారి. ఆయన పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏప్రిల్ 8న బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి కోల్‌కతాకు వచ్చారు. తరువాతఏప్రిల్ 16న కాశ్మీర్‌కు వెళ్లారు. ‘‘సెలవుల్లో అక్కడివెళ్లారు. అందరమూ వెళదామనుకున్నాం. కానీ కోడలితో వెళ్లమని నేనే చెప్పాను. ఈరోజు కూడా మధ్యాహ్నం కూడా అతనితో మాట్లాడాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు‘‘ అంటూ బితాన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మధ్యాహ్నం తనతో మాట్లాడాను. వాళ్లు కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, దగ్గరిలోని ప్లేసెస్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం.. కానీ అవే చివరి మాటలవుతా =యని అస్సలు అనుకోలేదంటూ మృతుడి సోదరుడు వాపోయారు.My heart goes out to the families of the victims of the devastating terrorist attack on the tourists in Jammu and Kashmir today. One of the victims, Sri Bitan Adhikari, is from West Bengal. I have talked with his wife over phone. Though no words are enough to console her in…— Mamata Banerjee (@MamataOfficial) April 22, 2025ఈ ఘటనపై కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. బాధితుల్లో ఒకరు, బెంగాల్‌కు బితాన్ అధికారి భార్యతో ఫోన్లో మాట్లాడానని, ఈ దుఃఖ సమయంలో ఆమెను ఓదార్చడానికి మాటలు సరిపోవడం లేదని విచారం ప్రకటించరాఉ. తని మృతదేహాన్ని కోల్‌కతాలోని అతని ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చాను. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అటు బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ కోల్‌కతాలోని బాధిత కుటుంబాన్ని కలిశారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర హోం శాఖ,న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ,జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్టు వెల్లడించారు.

కఠోర సాధన, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే, సివిల్స్‌లో సత్తా
వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని (Ettaboyina Sai Shivani) యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఇదీ చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్ ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువు కునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ్ర΄ోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్‌లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణంకఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలతోపాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్

పండ్లు వృథాగా పోకుండా.. ఆస్మోటిక్ డీ హైడ్రేషన్ బెస్ట్
బొప్పాయి, జామ, ఉసిరి వంటి పండ్లకు మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు తెగనమ్ముకోకుండా లేదా వృథాగా పారేయకుండా వాటిని ఎండ బెట్టి నిల్వ ఉండే వివిధ ఉత్పత్తులుగా మార్చితే రైతులకు మంచి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎండబెట్టే క్రమంలో ఆస్మోటిక్ డీహైడ్రేషన్ ప్రక్రియ మేలైనదని, తద్వారా అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసు కోవచ్చని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా స్థానం (ఐఐహెచ్ఆర్) చెబుతోంది.బొప్పాయి ఫ్రూట్ బార్ తయారీ విధానంబొప్పాయి మన దేశంలో ఒక ముఖ్యమైన పంట. అద్భుతమైన వాసన, రుచి, విటమిన్ ఎ, సిలకు ఇది పెట్టింది పేరు. బొప్పాయికి మార్కెట్లో గిరాకీ లేనప్పుడు దూర ప్రాంతాలకు ఖర్చులు భరించి రవాణా చేయటం కష్టం. అందువల్ల కోత అనంతర నష్టం బొప్పాయిలో చాలా ఎక్కువ. కొన్నిసార్లు చిన్న కాయలు లేదా బాగా పెద్ద కాయలను మార్కెట్లో అమ్మటం కష్టమవుతుంది. అటువంటప్పుడు రైతులు బొప్పాయి ఫ్రూట్ బార్ (బొప్పాయి తాండ్ర)ను తయారు చేసి అమ్ముకోవచ్చు. ఫ్రూట్ బార్లు పోషకవంతమైనవి. చూపులకు నచ్చుతాయి. రుచిగా ఉంటాయి. రవాణా చేయటం సులభం. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అయితే, బొప్పాయి గుజ్జుతో తాండ్రను తయారు చేయటం మామిడి అంత తేలిక కాదు. దీన్ని తయారు చేసే క్రమంలో పగుళ్లు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు ఒక ప్రాసెస్‌ను కనిపెట్టారు. నీటి శాతం తగ్గించి, తాండ్రగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. బొప్పాయి ఫ్రూట్ బార్ చక్కటి తాజా పండు మాదిరిగానే వాసన వస్తుంది. రూపం, రుచి కూడా బాగుంటాయి. దీన్ని చిరుతిండిగా తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, రక్షణ సిబ్బంది, సైనికులకు ఇది ఉపయోగకరం. ఈ డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్‌ను చిన్న, సన్నకారు పరిశ్రమలతో పాటు మధ్యతరహా పరిశ్రమల్లోనూ తయారు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్లకు ఉపయోగపడేలా ఈ సాంకేతికతను రూపొందించినట్లు ఐఐహెచ్ఆర్ పేర్కొంది. కిలో ఫ్రూట్ బార్ తయారు చేయడానికి 7-8 కిలోల బొ΄్పాయి కాయలు అవసర మవుతాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో ఆరు నెలలు నిల్వ ఉంటుంది.జామ ముక్కల వొరుగుల తయారీ టెక్నాలజీజామ పండ్లలో గుజ్జు ఎక్కువ నీటితో కూడి తియ్యగా ఉంటుంది కాబట్టి తాజా పండ్లు తినటమే బాగుంటుంది. జామ పండు చక్కటి సువానతో పాటు విటమిన్ సిని కలిగి ఉంటుంది. అయితే, పండు చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి, ప్రాసెస్ చేస్తే మంచి లాభదాయకం. జెల్లీ, జ్యూస్, ఫ్రూట్ బార్ వంటి ఉత్పత్తులను జామపండుతో తయారు చేయటం మనకు తెలుసు. అయితే, ఆస్మోటిక్ డైహైడ్రేసన్ పద్ధతిలో తొలుత నీటి శాతాన్ని తగ్గిస్తే.. పూర్థిస్థాయి ప్రాసెసింగ్, ఎయిర్ డ్రయ్యింగ్ చప్పున పూర్తవుతుంది. ఈ సాంకేతికత ద్వారా తెలుపు, గులాబీ రంగు గుజ్జు ఉండే జామ పండ్ల ముక్కలను డీౖహె డ్రేట్ చెయ్యొచ్చు. ఆస్మో–ఎయిర్ డ్రైడ్ ఫ్రూట్స్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా వినూత్నమైన పద్ధతి. జామ ముక్కలకు తొలుత పంచదార ΄ాకం కలపటం ఆస్మోటిక్ డీౖహె డ్రేషన్లో తొలి దశ. ఆ తర్వాత పాక్షికంగా నీరు తగ్గిన ముక్కలను హాట్ ఎయిర్ డ్రయ్యర్ ద్వారా తేమ శాతాన్ని 15% కన్నా తక్కువ తేమ ఉండేలా తయారు చేయాలి. ఇలా తయారైన జామ ఎండు ముక్కలను చిరుతిండిగా తినొచ్చు. లేదా ఇతర డ్రైఫ్రూట్స్‌తో కలిపి తినొచ్చు. దీన్ని ఐస్‌క్రీమ్ పరిశ్రమలో, ఫ్రూట్ సలాడ్లలో, ఖీర్‌లో, కేకులు, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పిల్లలకు, బరువైన వస్తువులు తీసుకెళ్లలేని పర్వతారోహకులకు, సైనికులకు ఎక్కువ ఉపయోగకరం. ఈ ప్రాసెస్ చాలా సులభం. పెద్ద యంత్ర పరికరాలేమీ అక్కర్లేదు. దీన్ని చిన్నసన్నకారు ప్రాసెసర్లు, మహిళా సంఘాలు, ఇతర స్వయం ఉపాధి పొందే వర్గాల వారు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కిలో ఆస్మో-ఎయిర్ డ్రైడ్ జామ ఒరుగులు తయారు చేయటానికి 7–8 కిలోల జామ పండ్లు కావాలి. 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంటాయి.సహజ రంగుతో కూడిన వుసిరి ఒరుగులుఔషధ గుణాల పుట్ట అయిన ఉసిరికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటుంది. అస్కార్బిక్ ఆసిడ్ అధిక పాళ్లలో కలిగిఉండటంతో పాటు యాంటీబయోటిక్, లాక్జేటివ్గా పనిచేసే గుణాలు దీనికి ఉన్నాయి. కోకుమ్ / మాంగోస్టీన్‌లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. దీని రంగును ఉసిరి ఒరుగులకు పట్టిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటు ఉసిరి, అటు మాంగోస్టీన్లలో ఔషధ గుణాలు ఎక్కువే గానీ అవి త్వరగా పాడైపోతాయి. వీటిని నేరుగా పండ్లను తినటం కష్టం. ప్రాసెస్ చేయాల్సిందే. కోకుమ్ జ్యూస్‌ను తీసి వుసిరి తొనలకు కలిపితే.. వుసిరి ఒరుగులకు మంచి ఎరుపు రంగుతోపాటు సువాసన వస్తాయి. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన వుసిరి తక్కువ అసిడిక్‌గా ఉంటాయి. రుచి బాగుంటుంది. ఎర్రటి ఈ ఒరుగులను విడిగా చిరుతిండిగా తినొచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, సైనికులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కోకుమ్ రంగు కలిపిన ఉత్పత్తులు మార్కెట్లో లేవు. చిన్న తరహా ప్రాసెసింగ్ సదుపాయాలున్న వారు వీటిని తయారు చేసుకోవచ్చు. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన ఉసిరి ఉత్పత్తులు తాజా పండ్ల మాదిరిగానే ఉంటాయి. 4-5 కిలోల ఉసిరి పండ్లు, 2 కిలోల కోకుమ్ పండ్లు కలిపి తయారు చేస్తే ఓస్మో-ఎయిర్ డ్రైడ్ స్లైసెస్ తయారవుతాయి. జాగ్రత్తగా నిల్వ చేస్తే ఒక ఏడాది పాటు నిల్వ ఉంటాయి.

కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్‌కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా? - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్హెచ్.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్‌కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా మెయింటెనెన్స్ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత మెయింటెనెన్స్స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 144 బీఎన్ఎస్ ( పా సీ.ఆర్.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి. నాకు, నా మూడేళ్ల కొడుకుకి మెయింటెనెన్స్ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. – ఒక సోదరి, కర్నూలు మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్ చట్టం లోని సెక్షన్ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్ చేయ వచ్చు.
ఫొటోలు


#DakshaNagarkar : హీరోయిన్ దక్ష నాగర్కర్ కిల్లింగ్ లుక్స్


హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్‌లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)


హైదరాబాద్ : ఘనంగా జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక (ఫొటోలు)


హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)


నెల్లూరులో కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి సందడి (ఫొటోలు)


SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)


Pahalgam: పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)


పెద్దమ్మ తల్లి గుడిలో బుల్లితెర జంట దావత్.. ఎందుకంటే? (ఫోటోలు)


హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న విష్ణుప్రియ (ఫోటోలు


నెత్తురోడిన కశ్మీర్ మినీ స్విట్జర్లాండ్.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)
అంతర్జాతీయం

నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్‌లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్‌లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పోప్ వారసుని ఎన్నిక ఇలా...
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నుకుంటారు. అందుకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. అది వాటికన్లోని సిస్టిన్ చాపెల్‌లో ఆద్యంతం అత్యంత గోప్యత నడుమ జరుగుతుంది. తుది ఫలితాన్నే తప్ప ప్రక్రియను ఎప్పటికీ బయటికి వెల్లడించరు. ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి చెప్పడం పూర్తిగా నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన కార్డినల్స్‌ను తక్షణం వెలి వేసేలా నిబంధనలను పోప్ బెనెడిక్ట్–16 కఠినతరం చేశారు. 1996లో పోప్ జాన్‌పాల్–2 తిరగరాసిన పోప్ ఎన్నిక తాలూకు నియమ నిబంధనలను బెనెడిక్ట్ రెండుసార్లు సవరించారు. → పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని ఎన్నుకునేదాకా రోజువారీ వ్యవహారాలను వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ చాంబర్లెయిన్ హోదాలో లాంఛనంగా నిర్వర్తిస్తారు. ఈ దశలో కీలక నిర్ణయాలేవీ తీసుకోరు. → పోప్ మృతిని చాంబర్లెయిన్ అధికారికంగా ధ్రువీకరించాక పోప్ నివాసానికి సీల్ వేస్తారు. → పోప్ అస్తమయంతో ఒకరిద్దరు మినహా దాదాపుగా వాటికన్ అధికారులంతా మాజీలవుతారు. → ‘ఫిషర్‌మన్స్ రింగ్’గా పిలిచే పోప్ అధికారిక ముద్రను చాంబర్లెయిన్ ప్రత్యేక సుత్తెతో విరగ్గొడతారు. తద్వారా ప్రస్తుత పోప్ పాలనకు తెరపడిందని లాంఛనంగా ప్రకటిస్తారు. → త్వారత కార్డినల్స్ కాలేజీ సమావేశమై పోప్ అంత్యక్రియల ఏర్పాట్లను ఖరారు చేస్తుంది. → ఫ్రాన్సిస్ కోరిక మేరకు అంత్యక్రియలు ఆయనకెంతో ఇష్టమైన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో సాదాసీదాగా జరుగుతాయి. సాధారణంగా పోప్ అంత్యక్రియలకు సైప్రస్, జింక్, ఇల్మ్తో కూడిన మూడు శవపేటికలను ఉపయోగిస్తారు. ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు మాత్రం ఆయన కోరిక మేరకు జింక్‌తో కూడిన ఒకే పేటికను వాడనున్నారు. → తర్వాత వాటికన్లో 9 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. ఈ సమయంలో కార్డినల్స్ అంతా రోమ్కు విచ్చేస్తారు. ప్రక్రియ ఇదీ.. → పోప్ మరణించిన 15 నుంచి 20 రోజులకు ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా మొదలవుతుంది. → కార్డినల్స్ అంతా సిస్టిన్ చాపెల్‌లో సమావేశమై పోప్‌ను ఎన్నుకుంటారు. 80 ఏళ్లలోపు వయసువారు మాత్రమే అందుకు అర్హులు. ప్రస్తుతం ఆలోపు వయసున్న కార్డినల్స్ 135 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎలక్టర్ల సంఖ్య 120కు మించరాదు. → పోప్ ఎన్నిక దీర్ఘచతురస్రాకృతిలో ఉండే కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. దానిపై భాగంలో ‘సుప్రీం పాంటిఫ్గా నేను ఎన్నుకుంటున్నది’ అని రాసుంటుంది. పేరు రాసేందుకు వీలుగా పక్కన ఖాళీ వదులుతారు. → ఒక్కో కార్డినల్ దానిపై తనకిష్టమైన వారి పేరు రాసి సగానికి మడిచి ట్రేలో వేస్తారు. దాన్ని సరిగ్గా నింపిందీ లేనిదీ స్రు్కటినీర్స్గా పిలిచే ముగ్గురు కార్డినల్స్ సరిచూస్తారు. → తర్వాత ఒక్కో బ్యాలెట్ తెరిచి అందులో రాసిన పేరు బయటికి చదువుతూ లెక్కిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం ఫలితాలను ప్రకటిస్తూ పోతారు. → కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వచ్చిన వారే తదుపరి పోప్ అవుతారు. అందుకోసం ఇనిíÙయల్ మాస్‌గా పిలిచే లాంఛన కార్యక్రమం అనంతరం ఫస్ట్ బ్యాలెట్ నిర్వహిస్తారు. పోప్‌ను ఎన్నుకోలేకపోతే బ్యాలెట్లను సూది ద్వారా దారానికి గుచ్చి ట్రేలో వేస్తారు. తర్వాత వాటిని స్తూపాకారపు స్టౌలో కాల్చేస్తారు. దాని తాలూకు పొగ నల్ల రంగులో సిస్టిన్ చాపెల్ చిమ్నీ గుండా అందరికీ కన్పించేలా బయటికొస్తుంది. ఇంకా పోప్‌ను ఎన్నుకోలేదని దాని అర్థం. అలా పోప్‌ను ఎన్నుకునే దాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది పూర్తవగానే తెల్ల పొగ వెలువడుతుంది. చర్చి గంటలు మోగుతాయి. → అనంతరం కార్డినల్స్ ‘మనం పోప్‌ను ఎన్నుకున్నాం’ అని ప్రకటిస్తారు. నూతన పోప్ ఎంచుకున్న పేరును చదివి విన్పిస్తారు. → చివరికి కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి అందరికీ దర్శనమిచ్చి తన తొలి ఆశీర్వాదమిస్తారు. → పోప్ ఎన్నిక ప్రక్రియ పొడవునా కార్డినల్స్‌తో పాటు అందులో పాలుపంచుకునే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. వారు మొబైల్స్‌తో సహా ఎలాంటి ఆడియో, వీడియో పరికరాలూ వెంట ఉంచుకునేందుకు వీల్లేదు. రేసులో వీరే బాప్టిజం తీసుకున్న క్యాథిలిక్ పురుషుడెవరైనా పోప్ కావచ్చు. అయితే 1378 నుంచి కేవలం కార్డినల్స్ మాత్రమే పోప్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా విన్పిస్తున్న కొన్ని పేర్లు... → ఇటలీకి చెందిన కార్డినల్ పియెట్రో పారోలిన్ (70). వాటికన్లో సీనియర్ దౌత్యాధికారి. ప్రస్తుత విదేశాంగ మంత్రి. → కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఔలెట్ (80). 2010 నుంచి 2023 దాకా వాటికన్ బిషప్స్ హెడ్‌గా ఉన్నారు. → ఆ్రస్టియాకు చెందిన కార్డినల్ క్రిస్టోఫ్ షోన్బర్న్ (80). పోప్ బెనెడిక్ట్–16 దగ్గర శిష్యరికం చేశారు. సంప్రదాయవాదిగా పేరు. → ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్డినల్ లూయిస్ టగ్లే (67. వాటికన్ మిషనరీ ఆఫీస్ సారథిగా ఫ్రాన్సిసే ఎంపిక చేశారు. → ఇటలీకి చెందిన కార్డినల్ మట్టెయో జుప్పీ (69). ఫ్రాన్సిస్‌కు బాగా ఇషు్టడు. కార్డినల్స్లో నలుగురు భారతీయులు పోప్‌ను ఎన్నుకునే 35 మందితో కూడిన కార్డినల్స్ కాలేజీలో నలుగురు భారతీయులున్నారు. వారు ఫిలిప్ నెరీ ఫెరారో, బాసెలియొస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకోబ్ కూవకాడ్.

చైనాలో 10జీ నెట్వర్క్..!
బీజింగ్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో డ్రాగన్ దేశం చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 10 గిగాబైట్స్ ఫర్ సెకన్స్() వేగంతో పనిచేసే 10జీ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. రాజధాని బీజింగ్ సమీపంలోని హుబే ప్రావిన్స్‌లో చేపట్టిన ప్రయోగ పరీక్షలో గరిష్టంగా 10 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు మీడియా వెల్లడించింది. ఈ వేగంతో అత్యంత స్పష్టతతో కూడిన రెండు పూర్తి సినిమాలను కేవలం సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ తదితర రంగాల్లో దీనితో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి.

పోప్ అస్తమయం
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. 88 ఏళ్ల ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ‘‘పోప్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారి తీసింది’’ అని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘తన జీవితమంతటినీ చర్చి, ప్రభువు సేవకే అంకితం చేసిన రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం 7.35కు తండ్రి సన్నిధి చేరారు’ అంటూ వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్ మత పెద్దలు, అధికారుల సందర్శన నిమిత్తం శాంతా మార్తా చాపెల్‌లో ఉంచుతారు. అనంతరం సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు తుది నివాళులు అరి్పస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్లో సంతాప దినాలు పాటించాక పోప్ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్ ఇటీవలే 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిమోనియాతో 1950ల్లోనే ఆయన కుడి ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. పోప్ చివరిసారిగా ఈస్టర్ సందర్భంగా ఆదివారం బయటి ప్రపంచానికి కన్పించారు.భారతీయులపై పోప్ ప్రేమాభిమానాలు మరవలేనివి: మోదీ న్యూఢిల్లీ: పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘ప్రేమాభిమానాలకు, సహానుభూతికి మారుపేరుగా ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. యువప్రాయం నుంచే ఫ్రాన్సిస్ క్రీస్తు సేవకు అంకితమయ్యారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. బాధల్లో ఉన్న కోట్లాదిమందిలో ఆశాదీపం వెలిగించారు. ఆజన్మాంతం ఫ్రాన్సిస్ ప్రదర్శించిన ఆధ్యాతి్మక స్థైర్యం అందరికీ ఆదర్శం. ముఖ్యంగా భారతీయుల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపారు. ఆయనతో భేటీ అయిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను’’ అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా పలు చర్చిల ప్రతినిధులు తదితరులు పోప్ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.సంతాపాల వెల్లువ పోప్ అస్తమయం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇది తమనెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని కియర్ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సలా వాండెర్ లెయన్, స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, డెన్మార్క్ ప్రధాని డిక్ స్కూఫ్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిల్ రషీల్ అల్ మక్తూమ్ తదితరులు సంతాప సందేశాలు విడుదల చేశారు. భావి తరాలకు ఫ్రాన్సిస్ గొప్ప ఆదర్శంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారమే పోప్‌తో భేటీ అవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుర్తు చేసుకున్నారు.సంస్కరణవాదిగా చెరగని ముద్ర అది 2013. పోప్ బెనెడిక్ట్–16 తన పదవికి రాజీనామా చేసి రిటైరయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిస్థితుల నడుమ 266వ పోప్‌గా ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్‌గా, తొలి జెస్యూట్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన అసలు పేరు జార్గ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జని్మంచారు. ఐదుగురు సంతానంలో అందరికంటే పెద్దవాడు. దైవసేవే తన మార్గమని 17 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు. 36 ఏళ్లకే అర్జెంటీనాలోని జెస్యూట్లకు సారథి అయ్యారు. 1992లో బ్యూనస్ ఎయిర్స్ సహాయ బిషప్, 1998లో ఆర్చి బిషప్ అయ్యారు. 2001లో కార్డినల్ అయ్యారు. అనంతరం పోప్‌గా 12 ఏళ్లకు పైగా తన పనితీరుతో చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోప్ల్లా రాజప్రాసాదంలో కాకుండా వాటికన్లోని ఓ హోటల్లో నివసించారు. 2023 దాకా బెనెడిక్ట్, ఫ్రాన్సిస్ రూపంలో వాటికన్లో ఏకకాలంలో ఇద్దరు పోప్లు ఉండటం ఓ అసాధారణ ఘటనగా నిలిచిపోయింది. అయితే బెనెడిక్ట్ అబార్షన్ వ్యతిరేక అజెండాను ఫ్రాన్సిస్ పూర్తిగా సమర్థించలేదు. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. ఎన్నో సంచలనాలు శరణార్థులు, అణగారిన వర్గాలతో పాటు స్వలింగ సంపర్కల పట్ల ఫ్రాన్సిస్ ఎంతో సహానుభూతి చూపారు. వారితో పాటు పేదలు, ఖైదీలు, అంటరాని వర్గాలకు చర్చి వ్యవస్థ పెద్ద దిక్కుగా నిలవాలని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహాటంగా ప్రకటించారు. అంతేగాక, ‘ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చి ఆశీర్వదించడానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు ప్రీస్ట్ బాధ్యతలు స్వీకరించడాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషప్‌లు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికనప్పుడల్లా గట్టిగా ఆక్షేపించారు. ఇరాక్ పర్యటన ఇరాక్‌లో పర్యటించిన తొలి పోప్‌గా ఫ్రాన్సిస్ నిలిచారు. అరబ్ దేశాల్లోనూ పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. వాటికన్ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చి వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయతి్నంచి సంచలనం సృష్టించారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు. పోప్‌ను ఎంపిక చేసే కీలక కార్డినల్ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్పై క్రిమినల్ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. వాటికన్ కార్యాలయాలపై పోలీసు దాడు లకూ అనుమతులిచ్చారు! వాటికన్ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెర వేశారు. వారందుకునే కానుకలపైనా పరిమితి విధించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫ్రాన్సిస్ పనితీరుపై కొన్ని వివాదాలూ తలెత్తకపోలేదు. మైనర్లపై లైంగిక వేధింపుల అభియోగాలున్న కార్డినల్ థియోడర్ మెక్కారిక్కు చాలాకాలం పాటు దన్నుగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీతో ఏపీకి తీరని నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం–1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాల వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలోని కేటాయింపులు కాకుండా ఇప్పుడు మళ్లీ కేటాయింపులను మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలను ఖరారు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీచేసిన సెక్షన్ 3ను రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నదీజలాల కేటాయింపు విషయంలో గతేడాది తీసుకున్న కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీజల వివాద చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు.గతంలో కృష్ణానది జలాల పంపిణీలో భాగంగా ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. అయితే ఈ కేటాయింపులను మళ్లీ మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలు ఖరారు చేయడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కోర్టు సమయం ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తదుపరి వాదనలు గురువారం లేదా మరోరోజు వింటామని ధర్మాసనం తెలిపింది.

పాక్‌కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్‌పై చర్యలివే... – సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్. – భారత్, పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్ హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.

బూత్ లెవల్ ఏజెంట్లకూ ఈసీ శిక్షణ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తొలి సారిగా బూత్ లెవల్ ఏజెంట్(బీఎల్ఏ) లకూ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో రాజకీయపార్టీల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్.. బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టింది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్(ఐఐఐడీఈఎం) భవనంలో ఈ శిక్షణ ఆరంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో బిహార్‌లోని 10 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 280 మంది బీఎల్ఏలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు బీఎల్ఏలనుద్దేశిస్తూ ప్రసంగించారు. మార్చి నాలుగోతేదీన జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల సమావేశంలో బీఎల్ఏల శిక్షణ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం, 1950, 1951, ఎలక్టర్ రిజిస్ట్రేషన్ నిబంధనలు–1960, ఎన్నికల నిబంధనల అమలు–1961లతో సమ కాలీనంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమనిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా బీఎల్ఏలు నడుచు కునేలా ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదంచేయనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం తమ పాత్ర, బాధ్యతలు ఎలాంటివో ఈ శిక్షణ తర్వాత బీఎల్ఏలకు మరింత స్పష్టమైన అవగాహన వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ఆశిస్తోంది. ఇందుకోసమే బీఎల్ఏలకు శిక్షణా కార్యక్రమం ఆచరణ లోకి వచ్చింది.

కర్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి.. జమ్మూకర్మీ ర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసుకున్నవారంతా ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల్లో దాదాపు 90శాతం రిజర్వేషన్లు రద్దయ్యాయి. గతంలో కర్మీర్‌లో ఉగ్రదాడులు జరిగాయి. కానీ ఈ దాడుల్లో ఇంతకు ముందెన్నడూ పర్యాటకులను గుర్తించి చంపలేదు. పహల్గాం సంఘటన తర్వాత మాత్రం మొత్తం పర్యాటక పరిశ్రమ, భాగస్వాములందరినీ ప్రభావితం చేసింది. కర్మీర్‌లో దాదాపు 80శాతం రిజర్వేషన్స్ రద్దయ్యాయి. జమ్మూకర్మీర్‌కు దాదాపు 90 శాతం బుకింగ్‌లను పర్యాటకులు రద్దు చేసుకున్నట్లు ఢిల్లీలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. వచ్చే నెలలో కర్మీర్‌లో పర్యటించడానికి రిజర్వేషన్లు చేసుకున్నారని, ఇప్పుడు ఇప్పుడు రద్దు చేయాలని కోరుతున్నారని వెల్లడించాయి. కర్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, హజన్ వ్యాలీ, తులిప్ గార్డెన్స్ ఎక్కువగా బుక్ అయ్యాయని, ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయని తెలిపారు. అక్కడకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టబోమని, రిఫండ్ చేయాలని కోరుతున్నారని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొంతమంది పర్యాటకులు కర్మీర్‌కు బదులుగా వేరే ప్రాంతాలకు మార్చుకుంటున్నారని ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలు నివేదించాయి. ‘‘కొన్ని కుటుంబాలు బస్సు, విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ల వరకు అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే ఉగ్రదాడి వార్త తెలిసిన మరుక్షణం నంచే రద్దు చేయాలని మాకు కాల్స్ రావడం ప్రారంభించాయి’’అని ఓ ట్రావెల్స్ యజమాని తెలిపారు. జమ్ముకర్మీర్ పర్యటనకు కీలక కేంద్రంగా ఉన్న కోల్‌కతాలోనూ అనేక మంది రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు. తమ రిజర్వేషన్లను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని క్లయింట్ల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే.. జమ్మూకర్మీర్‌కు బుకింగ్ చేయడం నిలిపేయాలని ఆదేశాలు వచ్చినట్లు మరికొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అన్ని రవాణా, బుకింగ్‌లను నిలిపివేయాలని ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ శ్రీనగర్ తమను ఆదేశించిందని, తదుపరి నోటీసు వచ్చే వరకు జమ్మూకర్మీర్ పర్యటనలకోసం కొత్త బుకింగ్‌లు చేయబోమని ప్రకటించాయి. ఇప్పట్లో కర్మీర్‌కు పర్యాటకులు రావడం కష్టమే... ‘పర్యటనలు రద్దు చేసుకుని పర్యాటకులు వెళ్లిపోతున్నారు. మరో నెల రోజుల ప్యాకేజీలను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనల తరువాత కూడా పర్యాటకులు ఇక్కడ ఉంటారని, వెంటనే ఇక్కడికి వస్తారని ఆశించలేం. గత కొన్నేళ్లుగా చేసిన మంచి పనులన్నీ వృథాగా పోయాయి. కర్మీర్‌కు మళ్లీ పర్యాటకులను రప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’శ్రీనగర్‌కు చెందిన ట్రావెల్ ఆపరేటర్ ఐజాజ్ అలీ తెలిపారు. నష్టాన్ని తగ్గిస్తాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ముకర్మీర్‌లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. జమ్మూకర్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడికక్కడ భద్రత... భయంతో చాలామంది పర్యాటకులు వెళ్లిపోతుండగా.. చాలా కొద్దిమంది ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. ‘దాడి గురించి వినగానే భయం వేసింది. ముంబైకి తిరిగి వెళ్లాలనుకున్నాం. కానీ హోటల్ సిబ్బంది మేం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. మాకు ఎలాంటి భయం లేదు. ఎక్కడికక్కడ భద్రత ఉంది. పహల్గాం సందర్శించాలి అనుకుంటున్నాం. పరిస్థితి బాగుంటే రేపు అక్కడికి వెళ్తాం. బయటకు వచ్చి చూడగా ఎక్కడ చూసినా పోలీసులు, సైన్యం ఉండడంతో టూరిస్టులు సేఫ్‌గా ఫీలవుతున్నారు. ఇప్పుడు భయం తగ్గుముఖం పడుతోంది’అని మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకురాలు చెబుతున్నారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
వీడియోలు


రివేంజ్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా..!


పహల్గాం ఘటన.. పాక్ సంబరాలు..?


భారత్-పాక్ మధ్య.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?


Pahalgam Terror Attack: ఈ ఘటన చాలా బాధాకరం


'పహల్గామ్' ఉగ్రదాడికి నిరసనగా...శ్రీకాకుళం YSRCP నాయకులు క్యాండిల్ ర్యాలీ


సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది


నాని కి గట్టి పోటీ ఇవ్వనున్న రెట్రో & రైడ్ 2


మధుసూదన్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి


ఎన్టీఆర్ నేను కలిసి, పిచ్చా పార్టీ చేసుకుంటాం..


రెమ్యునరేషన్ 2 కోట్లు తీసుకోవడంలో మొహమాటమే లేదు..