Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Key Comments At Ysrcp Pac Meeting1
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌ చేస్తున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులును అరెస్ట్‌ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్‌ అధికారుల పట​ ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్‌ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్‌ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్‌ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్‌ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్‌ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్‌ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్‌ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్‌ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ తీసేశారు. మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదు అని అడిగాను. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్‌లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్‌ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్‌ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్‌ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్‌ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్‌ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్‌ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్‌ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

Return to work, govt will protect salaries Mamata Banerje2
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఈనెల తొలి వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేల మంది రోడ్డున పడ్డారు. ఈ తీర్పును ఇప్పటికే ఖండించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మరోసారి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చారు. ‘ మీ ఉద్యోగాలకు, మీ జీతాలకు నేను గ్యారంటీ’ అంటూ మద్దతుగా నిలిచారు. నిరసన చేపట్టిన టీచర్లను బుజ్జగించే యత్నం చేశారు. మిడ్నాపోర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు అనే విషయంలో మీకు ఆందోళన వద్దు. ఉద్యోగం ఉందా.. జీతాలు సరైన సమయానికి పడుతున్నాయా లేదా అనే విషయం గురించే ఆలోచించండి. టీచర్లు నియామాకాల్లో పారదర్శకత సంబంధించి జాబితాను ప్రభుత్వం. కోర్టులు పరిశీలిస్తాయి,. మీ ఉద్యోగాలకు నేను గ్యారంటీ. తిరిగి స్కూళ్లకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. ఈ విషయం గురించి గత రాత్రి నుంచి చాలాసార్లే మాట్లాడాను. నేను మీతో ఉన్నా’ అని మమతా బెనర్జీ తెలిపారు. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని, అప్పటివరకూ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని మమత విజ్ఞప్తి చేశారు. కాగా, వెస్ట్‌ బెంగాల్‌లో 2016కు సంబంధించి ఉపాధ్యాయ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది.నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న

Vice President Jagdeep Dhankhar Rips Into Supreme Court Again3
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(jagdeep dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్‌ మాస్టర్స్‌’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్‌ మాస్టర్స్‌. పార్లమెంట్‌ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ధన్‌ఖడ్‌ ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. రాజ్యాంగ కార్యకర్తగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు. అంతకు ముందు.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడానికి ముడిపెడుతూ ధన్‌ఖడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ సీనియర్‌ న్యాయవాది, పైగా ఉప రాష్ట్రపతి హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపేక్షాలు సహా మేధో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది.మరోవైపు.. బీజేపీ నేతలు సహా ధన్‌ఖడ్‌ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సుప్రీం కోర్టు(supreme court) స్పందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

Telangana Intermediate 2025 Results Direct Link Click Here4
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒకే క్లిక్‌తో క్షణాల్లో రిజల్ట్స్‌ ఇలా..

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. జస్ట్‌ ఒకే ఒక్క క్లిక్‌తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.క్లిక్‌ చేయండి👉 ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌ క్లిక్‌ చేయండి👉 ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌క్లిక్‌ చేయండి👉 ఫస్ట్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌క్లిక్‌ చేయండి👉 సెకండ్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు.గతం కన్నా మెరుగైనా ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని మంత్రి భట్టి తెలిపారు. పాసైన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారయన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్‌ సెకండర్‌ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి అడ్వాన​్స్‌డ్‌ పరీక్షలు ఉండనున్నాయి. రీకౌంటింగ్‌, వెరిఫికేషన్‌కు వారం గడువు ఇచ్చింది ఇంటర్‌ బోర్డు.

IPL 2025: Rajasthan Royals Face Match Fixing Allegations After Shocking Loss Vs LSG5
ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం.. రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆరోపణలు

ఐపీఎల్‌ 2025లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్‌ 19న రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స​్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్‌ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్‌పై విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశాడు. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్‌ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్‌-ఢిల్లీ మ్యాచ్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా రాయల్స్‌ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్‌ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్‌లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్‌పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్‌ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్‌ 19న జరిగిన రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌పై సగటు క్రికెట్‌ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్‌ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్‌లో రాయల్స్‌ గెలుపుకు చివరి ఓవర్‌లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్‌ జురెల్‌, హెట్‌మైర్‌ ఉన్నారు. అయినా రాయల్స్‌ చివరి ఓవర్‌లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్‌ను ఆవేశ్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మూడో బంతికి డేంజరెస్‌ హెట్‌మైర్‌ను ఔట్‌ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్‌ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్‌లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌ను ఔట్‌ చేశాడు. జనాలు ఆవేశ్‌ టాలెంట్‌ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు.

UPSC Civil Services Final Result 20246
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ -2024 ఫలితాలు విడుదల

ఢిల్లీ: యూపీఏఎస్సీ-2024 సివిల్స్‌ ఫలితాలు (UPSC CSE Final Result 2024) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 1009మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శక్తి దుబేకు మొదటి ర్యాంకు రాగా సాయి శివానీ 11వ ర్యాంక్‌, బన్నా వెంకటేష్‌కు 15వ ర్యాంక్‌, శ్రావణ్‌ కుమార్‌ రెడ్డిలు 63వ ర్యాంక్‌ సాధించారు. ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్‌ ప‌రీక్ష (సీఎస్ఈ) ప‌రీక్ష ఫలితాలు మం‍గళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఏఎస్సీ అధికార వెబ్‌సైట్లో నేరుగో చూసుకోవచ్చు.👉యూపీఏఎస్సీ-2024 సివిల్స్‌ ఫలితాల పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండిఇక ఈ ప‌రీక్ష‌ను మొత్తం 1,056 ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు యూపీఏస్సీ గతేడాది నోటిఫికేషన్‌ విడదల చేసింది. ఫిబ్రవరి 14, 2024న విడుద‌ల చేయ‌గా, జూన్ 16, 2024న ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది.తరువాత‌, సెప్టెంబ‌ర్‌లో 20 నుంచి 29వ తేదీ వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌గా, ఇంట‌ర్వ్యూల‌ను ఈ ఏడాది జ‌న‌వ‌రి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన యూపీఏఎస్సీ ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది.యూపీఏఎస్సీ-2024 సివిల్స్‌ ఫలితాల వివరాలుసివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులు- 1009జనరల్ కోటలో ఎంపికైన అభ్యర్థులు -335ఈడబ్ల్యూఎస్ కోటలో సివిల్స్ ఎంపికైన అభ్యర్థులు- 109సివిల్స్ ఎంపికైన ఓబిసి అభ్యర్థులు- 318ఎస్సీలు -160, ఎస్టీలు- 87

vizianagaram Student Slap Lecturer With Slipper Video Viral7
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని

విజయనగరం, సాక్షి: జిల్లాలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్‌ ప్రాంగణంలో ఓ విద్యార్థిని ఫోన్‌ మాట్లాడుతుండగా.. ఓ మహిళా లెక్చరర్‌ అడ్డుకుని ఫోన్‌ లాక్కుంది. ఈ క్రమంలో ఫోన్‌ ఇవ్వాలంటూ సదరు విద్యార్థిని లెక్చరర్‌ను దుర్భాషలాడింది. అందుకు లెక్చరర్‌ నిరాకరించడంతో విద్యార్థిని సదరు లెక్చరర్‌ను చెప్పుతో కొట్టింది. లెక్చరర్‌ సైతం ఆమెపై ప్రతిదాడి చేయగా.. తోటి విద్యార్థులు, ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థిని వీడియో తీయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై రఘు కాలేజ్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.#RaghuEngineeringCollege #Vizianagaram #Vizag #AndhraPradesh #UANow pic.twitter.com/APzPn1isCK— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 22, 2025

TSRTC Md V C Sajjanar tweets anti betting pps song goes viral 8
బెట్టింగ్‌ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో ఇంట్రస్టింగ్‌ ట్వీట్‌ వైరల్‌

బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. బెట్టింగ్‌ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’ పేరుతో సజ్జనార్‌ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే.బెట్టింగ్‌ యాప్స్‌ మోజులో అనేకమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు సజ్జనార్‌. ఈ పోరు భాగంగానే తాజాగా ‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు అంటూ ఒక చక్కటి గీతాన్ని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.మన్మథుడు సినిమాలోని ‘వద్దురా.. పెళ్లొద్దురా ’ అనే సాంగ్‌ తరహాలో వద్దురా.. సోదరా.. బెట్టింగ్‌ జోలికి పోవద్దురా అంటూ ఇద్దరు గాయనీ మణులు ఒక పేరడీ సాంగ్‌ను పాడారు. దీన్ని సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.‘‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి. #SayNoToBettingApps @Cyberdost… pic.twitter.com/9DU8NNpCkv— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 22, 2025 ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. బెట్టింగ్‌ యాప్స్‌ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి’’ అంటూ ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడిన అనేక ఘటనలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలకలం రేపాయి.

Bachao Karreguttalu: CRPF Huge Operation at Mulugu April 22nd 2025 Updates9
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్‌.. భారీ ఎన్‌కౌంటర్‌!

ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Alternative Investments of Gold in India10
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..

భారతదేశంలో బంగారం ధర రూ. లక్ష దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78వేలు (10 గ్రా) వద్ద ఉన్న గోల్డ్.. నాలుగు నెలలు పూర్తి కాకుండానే, భారీ పెంపును పొందింది. పసిడి రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొంతమంది సతమతమవుతుంటారు. బంగారం మీద కాకుండా.. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఈ కథనంలో చూసేద్దాం..రియల్ ఎస్టేట్బంగారం మీద పెట్టుబడి వద్దనుకుంటే.. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ డబ్బుకు అధిక మొత్తంలో లాభం రావాలంటే.. ఇల్లు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ రంగంలో ముందస్తు పెట్టుబడిగా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది స్థిరమైన.. దీర్ఘకాలిక ఆస్తి. తప్పకుండా భవిష్యత్తులో మంచి లాభలను తెచ్చిపెడుతుంది.గోల్డ్ ఈటీఎఫ్‌లు & సావరిన్ గోల్డ్ బాండ్‌లుబంగారం కొనుగోలు వద్దనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBs) భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటుస్టాక్‌లు & మ్యూచువల్ ఫండ్‌లుబ్లూ-చిప్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కూడా.. బంగారం మీద పెట్టుబడికి ప్రత్యామ్నాయమే. అయితే ఇందులో కాలక్రమేణా రాబడి పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్లలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.ఫిక్స్‌డ్ డిపాజిట్లు & బాండ్లుకార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడ కొంత తక్కువ రిస్క్ ఉంటుంది. స్థిరమైన రాబడి లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా కూడా మంచి రాబడులు పొందవచ్చు.డిజిటల్ గోల్డ్ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మోంట్, సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 24 క్యారెట్ల బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గోల్డ్ వెయిట్ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని నగదుకు విక్రయించవచ్చు లేదా భౌతిక బంగారంగా రీడీమ్ చేయవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement