ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

ఏడు నిమిషాల మీటింగ్‌లో ఊడిన ఉద్యోగాలు

Published Thu, Mar 14 2024 1:15 PM

IBM Cuts More Jobs In Two Divisions With In Seven Minutes - Sakshi

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరిట నిత్యం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కరోనా సమయంలో దాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని ఉద్యోగాలు తొలగించాయి. అంతర్జాతీయ యుద్ధ భయాలు, ఆర్థికమాంద్యం అంటూ ఇంకొన్ని ఉద్యోగాలు తొలగించారు. ప్రస్తుతం ఏఐ సాకు చెబుతూ మరికొంతమందిని ఇంటిబాట పట్టిస్తున్నారు. తాజాగా దిగ్గజ కంపెనీ అయిన ఐబీఎం మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.

ఐబీఎం చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ జొనాథన్‌ అదాషేక్‌ ఇటీవల సమావేశం నిర్వహించి.. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తున్నామని ప్రకటించినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే, కేవలం ఏడు నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు కంగు తిన్నారు. ఎంతమందిని తొలగించారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు.

ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. 

ఐబీఎం కార్యకలాపాల్లో భవిష్యత్తులో కృతిమ మేధను భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ అరవింద్‌ కృష్ణ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రానున్న రోజుల్లో కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీలో దాదాపు 30శాతం ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురానున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement