Secunderabad To Visakhapatnam Vande Bharat Express Train Hits Ox, Details Inside - Sakshi
Sakshi News home page

Vande Bharat Train: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని ఎద్దు మృతి..

Published Sun, Mar 12 2023 4:11 PM

Secunderabad Visakhapatnam Vande Bharat Express Train Hits Ox - Sakshi

చింతకాని: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ వద్ద శనివారం సాయంత్రం అర్ధగంటపాటు నిలిచిపోయింది. విశాఖపట్నం వెళ్తున్న ఈ రైలు నాగులవంచ రైల్వేస్టేషన్‌ సమీపంలోకి వచ్చేసరికి.. పట్టాలపైకి వచ్చిన ఎద్దును ఢీకొంది.

ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, రైలు ఇంజిన్‌ ముందు భాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైలును నిలిపివేసిన లోకో పైలట్లు.. లోపాన్ని సరిదిద్దాక అర్ధగంట అనంతరం బయలుదేరారు.
చదవండి: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు..

Advertisement
 
Advertisement
 
Advertisement