కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు.
సాక్షి, విజయవాడ బ్యూరో: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. టీడీపీకి కాపులు దూరం కాకుండా ఉండేలా, ముద్రగడ ఇమేజ్ పెరగకుండా ఉండేలా ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. ముద్రగడ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలో తెలియక వారు మల్లగుల్లాలు పడ్డారు.
ఆ కారణంగానే చంద్రబాబు హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయతో రెండు దఫాలు సమావేశమై చర్చిం చారు. ముద్రగడ ఎపిసోడ్‌తో రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతోందని, ఏదో ఒకటి చేసి పరిస్థితిని దారికి తెచ్చుకోకపోతే పార్టీకి, ప్రభుత్వానికి నష్టమని వారు చర్చించినట్టు సమాచారం.