31న ఆలయాల్లో ప్రార్థించండి: ముద్రగడ | Mudragada Padmanabham comments on Chandrababu | Sakshi
Sakshi News home page

31న ఆలయాల్లో ప్రార్థించండి: ముద్రగడ

Published Mon, Jan 30 2017 1:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

31న ఆలయాల్లో ప్రార్థించండి: ముద్రగడ - Sakshi

31న ఆలయాల్లో ప్రార్థించండి: ముద్రగడ

కిర్లంపూడి: కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేసేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి ప్రార్థించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులకు బహిరంగ లేఖ రాశారు. దీన్ని ఆదివారం పత్రికలకు విడుదల చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తూ కాపులను బీసీల్లో కలుపుతానని ఇచ్చిన హామీనే తాము గుర్తు చేస్తున్నామన్నారు. తాను  గాంధేయ మార్గంలో పాదయాత్ర చేసేందుకు రెండుసార్లు ప్రయత్నం చేస్తే ఉక్కుపాదాలతో అణచివేశారన్నారు. మనం తుని ఐక్య గర్జన జరుపుకుని ఈనెల 30వ తేదీకి ఏడాది పూర్తవుతుందనీ ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాపు సోదర, సోదరీమణులంతా  అందుబాటులో ఉన్న దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టి భగవంతుని ప్రార్థించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement