ఏసీ సీఎం చంద్రబాబు వ్యవసాయ నీటిపారుదల అధికారులతో భేటీ అయ్యారు. 30 వేల కోట్లతో హరిత ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు.
హైదరాబాద్: ఏసీ సీఎం చంద్రబాబు వ్యవసాయ నీటిపారుదల అధికారులతో భేటీ అయ్యారు. 30 వేల కోట్లతో హరిత ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో 30 వేల మంది రైతులు 3 పంటలు వేసేలా ప్రోత్సహించాలని ఆయన అధికారులకు తెలిపారు. తన ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి కష్టం రాకూడదని చంద్రబాబు చెప్పారు.
ఇప్పటికే రైతులు తుపానుల వల్ల చేతికందిన పంటను నష్ట పోతున్నారని, హరిత ప్రాజెక్టు ద్వారా రైతులకు సాంకేతిక సహాయాన్ని అందజేయాలని ఆయన పేర్కొన్నారు.