
గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జగన్. చిత్రంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, వేమిరెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొని మహాత్మునికి నివాళులర్పించారు.
జగన్‌ను కలసిన యూఎస్ కాన్సులేట్ జనరల్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా బుధవారం లోటస్‌పాండ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు.