
గుంటూరు, సాక్షి: ఏపీ మాజీ మంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారాయన.
నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) మూడో వర్ధంతి సందర్భంగా.. నేను ఆయన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్ యూ గౌతమ్ అంటూ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన.

ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్ మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన విజయం సాధించారు.
