
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు.
చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు.