సాక్షి, గుంటూరు: నరసరావుపేట కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిడ్నీ మార్పిడికి సంబంధించిన రికార్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నరసరావుపేట ఎమ్మార్వో, ఆర్డీవోలను విచారించేందుకు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శోభామంజరి, అధికారులు వారి కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఆయా కార్యాలయాల్లో ఆ అధికారులు లేకపోవడంతో గుంటూరు తిరిగి వచ్చారు.