
ముంబై: మహా నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా పెద్ద ఎత్తున మంటలు చుట్టుముట్టడంతో.. ఆర్పేందుకు 15 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ఫ్యాక్టరీలో మంటలకు కారణమయ్యే వివిధ రకాల రసాయనాలను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న దట్టమైన పొగలు, మంటలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి.